- వైసీపీ అధినేత జగన్పై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు
- మేనకోడలి పెళ్లికి మేనమామగా దీవించాల్సింది పోయి అడ్డుకుంటున్నారని ఆరోపణ
- సొంత కుటుంబం పట్లనే అలా ఉంటే, రాష్ట్ర మహిళలను ఏం చూసుకుంటారని వ్యాఖ్య
- మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి పలువురు వైసీపీ, సీపీఎం నేతల చేరిక
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సొంత కుటుంబ సభ్యుల విషయంలోనే జగన్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ట్వీట్ చేశారు. ప్రతి కుటుంబంలో మేనకోడలి పెళ్లికి మేనమామ అన్నీతానై ఆశీర్వదించి పంపుతాడని, కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ తెలిపారు.
దివంగత వైఎస్సార్ సొంత ఇంట్లో ఆయన మనవరాలి పెళ్లి జరగకుండా జగన్ అడ్డుకుంటున్నారని లోకేశ్ ఆరోపించారు. "సొంత చెల్లెలి విషయంలోనే ఇలా ప్రవర్తిస్తే, గత ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలను, సోదరీమణులను ఆయన ఎలా చూసుకున్నారో ప్రజలకు ఇప్పటికే అర్థమైంది" అని లోకేశ్ వ్యాఖ్యానించారు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
లోకేశ్ సమక్షంలో చేరికలు
మరోవైపు, ఉండవల్లిలోని తన నివాసంలో పలువురు నేతలను నారా లోకేశ్ టీడీపీలోకి ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన సీపీఎం నేతలు శివన్నారాయణ (కొలనుకొండ), ముసలి జ్యోతిబసు (ఆత్మకూరు)లతో పాటు వైసీపీ నేతలు నూతలపాటి చెన్నకేశవరావు (పేరుకలపూడి), ఉయ్యూరు వెంకటేశ్వరరావు (ఈమని), ముద్రబోయిన శ్రీను, షేక్ యూసబ్ (చిలువూరు) టీడీపీలో చేరారు. వీరందరికీ లోకేశ్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ, సీపీఎం కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.