- 2027 జూన్ 12 నాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తికి డెడ్‌లైన్ అన్న నారాయణ
- నగరాన్ని దోమల్లేని నగరంగా మార్చడమే లక్ష్యమని వెల్లడి
- గత ప్రభుత్వం 5 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శ
నెల్లూరు నగరాన్ని దేశంలోనే నంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2027 జూన్ 12 నాటికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి, నెల్లూరును దోమల్లేని నగరంగా మారుస్తామని ఆయన ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసంలో జరిగిన కూటమి పార్టీల ముఖ్య నేతల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 శాతం పనులు మిగిలి ఉన్నా అండర్‌గ్రౌండ్ పనులు పూర్తి చేయలేదని నారాయణ విమర్శించారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులకు వెంటనే నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పనులకు తేడాను గమనించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి నారాయణ నగరాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నారని, ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. కోటంరెడ్డి మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని, అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొని, నెల్లూరు అభివృద్ధికి కూటమి నేతలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.