- స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లకు పాల్పడుతోందన్న మంత్రి అనగాని
- పుంగనూరు, తిరుపతి సహా పలుచోట్ల దాడులే ఇందుకు నిదర్శనమని వెల్లడి
- ప్రజలు చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతిస్తున్నారని స్పష్టీకరణ
- 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ తీరు మారలేదని విమర్శ
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడుతోందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతు పొందలేకే జగన్ హింసా రాజకీయాలను ఎంచుకున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పుంగనూరు, తిరుపతి, రాయచోటి, పులివెందుల, కడప, దర్శి, కనిగిరి వంటి ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు చేసిన దాడులే ఇందుకు నిదర్శనమని అనగాని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా హింసను ప్రోత్సహించడమే జగన్ నైజమని, గత ఐదేళ్ల పాలనను చూసి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. కుట్రలు, దాడులు, విధ్వంసాలతో ప్రజల ఓట్లు సాధించలేరనే వాస్తవాన్ని జగన్ గుర్తించాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని మంత్రి తెలిపారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛాంపియన్ కూటమి విజయ దుందుభి మోగిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. "స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసైనా గొడ్డలి పార్టీ నాయకులకు, జగన్ రెడ్డికి బుద్ధి రావాలి. ఇక ఆ పార్టీ దుకాణం సర్దేసుకోవడం మంచిది" అని అనగాని సత్యప్రసాద్ తన ప్రకటనలో వ్యాఖ్యానించారు.