- జగపతిబాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో
- మంత్రి నారా లోకేశ్ తో స్పెషల్ ఎపిసోడ్
- స్కూల్ రోజుల్లో తన అల్లరి, పెళ్లి నాటి సరదా సంగతులు వెల్లడి
- మామయ్య బాలకృష్ణకు ఒకే ఒక్క వ్యక్తి అంటే భయమంటూ ఆసక్తికర వ్యాఖ్య
- లెజెండ్ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్‌తో ఆకట్టుకున్న లోకేశ్
- విడుదలైన ప్రోమోకు వీక్షకుల నుంచి అద్భుత స్పందన
నిత్యం బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సెలబ్రిటీ టాక్ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. జీ5 ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ షో సీజన్ 2లో లోకేశ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ, ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ షోలో నారా లోకేశ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సరదా విషయాలను పంచుకున్నారు. తన స్కూల్ రోజులను గుర్తుచేసుకుంటూ, తరగతిలో అందరికంటే ఎక్కువ పనిష్మెంట్లు తనకే పడేవని నవ్వుతూ చెప్పారు. "నిజంగానే అంత అల్లరి చేసేవారా?" అని జగపతిబాబు ప్రశ్నించగా.. "మామయ్యతో పోటీ పడాల్సి వచ్చేది" అంటూ లోకేశ్ చమత్కరించారు. తన పెళ్లికి ముందు జరిగిన ఓ సరదా సంఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. తనను ‘అల్లుడుగారు’ అని పిలవగానే, ఏదో ఫిట్టింగ్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వచ్చిందని సరదాగా గుర్తుచేసుకున్నారు.
ఇదే క్రమంలో, మామ నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఆయన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ప్రోమో చివర్లో లోకేశ్, బాలయ్య ఐకానిక్ చిత్రాల్లో ఒకటైన 'లెజెండ్' సినిమాలోని "ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు!" అనే పవర్ఫుల్ డైలాగ్‌ను చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు.
కాగా, ఈ పూర్తి ఎపిసోడ్ నవంబర్ 6న జీ5లో ప్రీమియర్ కానుండగా, నవంబర్ 8న సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్లో ప్రసారం కానుంది.