వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) ఆయన పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా రేపు, ఎల్లుండి ఆయన స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

పర్యటన షెడ్యూల్ ప్రకారం, జగన్ మంగళవారం (27వ తేదీ) ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి వెళ్లి, అక్కడ ప్రజలను కలుసుకుంటారు. వారి సమస్యలు, వినతులను స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారు. ఆ రోజు రాత్రికి పులివెందులలోని తన నివాసంలోనే బస చేస్తారు.

రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం (28వ తేదీ) ఉదయం ఆయన పులివెందుల నుంచి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లనున్నారు.