- బంగాళాఖాతంలో 'అర్ణబ్' తుపాను
- యానాం వద్ద ఈ నెల 28న తీరం దాటనున్న తుపాను
- కోస్తాంధ్రలోని 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన ప్రభుత్వం
- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్ణబ్' తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గంట గంటకూ పరిస్థితిని సమీక్షిస్తూ, రాష్ట్ర యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించడమే లక్ష్యంగా ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తుపాను గమనాన్ని, ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.
భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరికల ప్రకారం, అర్ణబ్ తుపాను రేపటికల్లా తీవ్ర తుపానుగా బలపడి రాష్ట్రంపై ప్రభావం చూపనుంది. ఈ నెల 28వ తేదీన బాపట్ల-విశాఖ మధ్య యానాం వద్ద ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుపాను ప్రభావంతో రేపు మధ్యాహ్నం నుంచి ఉత్తర కోస్తాంధ్ర, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఈ నెల 28, 29 తేదీల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు, సహాయక చర్యలు
తుఫాన్ నేపథ్యంలో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు (షెల్టర్లకు) తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులు, బాలింతలు, చిన్నారులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,711 మంది గర్భిణీలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభావిత జిల్లాల్లో వైద్య బృందాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను 11 జిల్లాల్లో మోహరించాలని, అదనపు బలగాలను ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్లో రిజర్వ్‌లో ఉంచాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సేవలను కూడా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
తుపాను వల్ల పంట నష్టం జరగకుండా చూడాలని, ఇప్పటికే కోత కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా రైతులకు సహకరించాలని వ్యవసాయ శాఖకు సీఎం సూచించారు. రాష్ట్రంలో సుమారు 1.82 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించేందుకు సిబ్బందిని, సామగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యావసరాలు, రేషన్ సరకులు అందుబాటులో ఉంచాలన్నారు.
తుపాను గమనాన్ని బట్టి ప్రతి నాలుగు గంటలకూ ప్రజలకు హెచ్చరికలతో కూడిన బులెటిన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. గత తుపానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. తుపాను తీవ్రతను బట్టి ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.