రైతులు పంట గురించి ఆలోచించాలే తప్ప ఆందోళన చెందకూడదు: నర్సింగోలులో చంద్రబాబు ప్రసంగం డీటెయిల్స్
- ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- 'మీ భూమి-మీ హక్కు' కింద రాజముద్రతో కొత్త పాస్‌బుక్‌ల పంపిణీ
- రూ.166 కోట్లతో పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్‌కు శంకుస్థాపన
- అధికారుల పనితీరుపై బహిరంగంగా సమీక్ష.. పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశం
- బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా పాలన సాగిస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో శుక్రవారం ఆయన పర్యటించి, 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైతు పొలంలో పంట గురించి ఆలోచించాలి గానీ, తన భూమి భద్రతపై ఆందోళన చెందకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల విషయంలో జరిగిన అవకతవకలను సరిదిద్ది, రైతులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. "మీ భూమి మీదే, హక్కు మీదే, ఆ హక్కును కాపాడే బాధ్యత మాది. అందుకే పాత పాస్‌బుక్‌లపై నాయకుల బొమ్మలు తొలగించి, ప్రభుత్వ రాజముద్రతో గ్యారెంటీ ఇస్తున్నాం" అని అన్నారు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని, రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన 22ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 16.48 లక్షల ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించామని, ప్రకాశం జిల్లాలోనే 3,304 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించి 7,980 కుటుంబాల ఆశలను నిజం చేశామని తెలిపారు. గర్భకండ్రిగ వంటి ఏళ్లనాటి భూములకు సైతం విముక్తి కల్పించామన్నారు. భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భద్రపరిచామని, రైతులు తమ ఇంటి నుంచే తమ భూమి వివరాలను ఫోన్‌లో చూసుకోవచ్చని చెప్పారు. ప్రతి నెలా 9వ తేదీన ఈ కార్యక్రమ పురోగతిని తానే స్వయంగా సమీక్షిస్తానని, అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రాజెక్టులకు శంకుస్థాపన.. అభివృద్ధికి బాటలు
ఈ పర్యటనలో భాగంగా, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి, పాలేరు నదిపై హైలెవల్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాల్లోని 30,000 మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను నీళ్లు విడుదల చేశాకే జాతికి అంకితం చేశామని, ఫేజ్-2ను కూడా పూర్తి చేసి ఏటా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాబోయే మూడేళ్లలో రూ.36 వేల కోట్లతో 35 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రామాయపట్నం పోర్టును వేగంగా పూర్తి చేస్తున్నామని, బీపీసీఎల్ రూ.50 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని అన్నారు. దోనకొండను కీలక పారిశ్రామిక టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
వేదికపైనే 'పబ్లిక్ ఆడిట్'.. అధికారులకు చురకలు
ఈ సభలో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రధాన ఘట్టం.. చంద్రబాబు వేదికపైనే నిర్వహించిన 'పబ్లిక్ ఆడిట్'. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను వేదికపైకి పిలిచి, ప్రజా స్పందన ఆధారంగా రూపొందించిన పనితీరు గణాంకాలను (పెర్ఫార్మెన్స్ డేటా) చదివి వినిపించారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం ఏయే అంశాల్లో వెనుకబడి ఉందో అంకెలతో సహా వివరించారు.
ముఖ్యంగా తాగునీటి సరఫరా (-7.93%), రవాణా శాఖ పన్నులు (-7.32%), రీ-సర్వే (-7.53%), అంగన్‌వాడీ సేవలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటి అంశాల్లో ప్రతికూల పనితీరుపై అధికారులను నేరుగా ప్రశ్నించారు. "మీరు సరిగా పనిచేయకపోతే ప్రజలు నన్ను నిందిస్తారు. మీవల్ల నేను మాట పడాలా? పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు" అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అదే సమయంలో గృహ నిర్మాణం (హౌసింగ్), ఇసుక సరఫరా, మత్స్యకార భరోసా వంటి అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులను అభినందించారు.
నాలుక చెప్పిందని కాకుండా, మంచి ఆహారం తీసుకోవాలి
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యమే అసలైన సంపద అని, తాను రోజూ మూడు కోడిగుడ్లలోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్ తింటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంటగదినే ఔషధశాలగా మార్చుకోవాలని, నాలుక చెప్పిందని కాకుండా శరీరానికి ఏది మంచిదో అదే తినాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసి, సరైన సమయంలో మందులు వేసుకునేలా గుర్తుచేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
సంక్షేమం, రాజకీయ అంశాలపై వ్యాఖ్యలు
ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వేగంతో పనిచేస్తోందని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలైన పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా మూడు ఉచిత సిలిండర్లు, అన్నదాత సుఖీభవ వంటివి విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, తాము 34 శాతానికి పెంచితే, ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నా, పార్టీపరంగా 34 శాతం కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చి వారి రాజకీయ ఎదుగుదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
నేను నీతిమంతుడిగా ఉంటే సరిపోదు
నీతివంతమైన రాజకీయాలు చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "నేను నీతివంతుడిగా ఉంటే సరిపోదు, నా కింద పనిచేసే అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు కూడా అవినీతికి దూరంగా ఉండాలి. చిత్రగుప్తుడిలా అందరి ఖాతాలను రాసుకుంటున్నాను. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే ఎవరికీ తెలియదనుకోవడం భ్రమ. నేను 360 డిగ్రీల కోణంలో అందరినీ గమనిస్తున్నాను" అని హెచ్చరించారు. ప్రజాసేవకుడిగా ప్రజల బాగోగులే తనకు ముఖ్యమని, దేశభక్తిని, రాష్ట్రంపై అభిమానాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలని కోరారు. అంతిమంగా, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే తన ఆశయమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.