360 డిగ్రీల కెమెరా.. లెవల్-2 ఏడీఏఎస్.. హోండా ఎలివేట్‌లో కొత్తగా అదిరిపోయే అప్‌డేట్స్
- ముందు భాగంలో హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్
- కొత్తగా హనీ కోంబ్ డిజైన్ గ్రిల్‌తో పాటు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్
- ముందు సీట్లకు వెంటిలేషన్, 8-వే పవర్ డ్రైవర్ సీట్
- వెనుక వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
- భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ఏడీఏఎస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
హోండా కార్స్ ఇండియా తన ఎలివేట్ ఎస్‌యూవీని అప్‌డేట్ చేసింది. ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.11.80 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది.
ఫేస్‌లిఫ్ట్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. కొత్త డిజైన్ ఎలిమెంట్లతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ముందు భాగంలో హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్ ఇచ్చారు. హనీ కోంబ్ డిజైన్ గ్రిల్‌ను కూడా కొత్తగా అందించారు. ఎస్‌యూవీ మొత్తం ఆకారం దాదాపు అలాగే ఉంది. వెనుక భాగంలో మాత్రం మార్పులు చేశారు. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌ను తీసుకొచ్చారు.
కొత్త ఎలివేట్‌ను నార్డిక్ ఫారెస్ట్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, మెటియరాయిడ్ గ్రే మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్ రంగుల్లో కొనుగోలు చేయొచ్చు.
ఫీచర్ల విషయానికి వస్తే ముందు సీట్లకు వెంటిలేషన్, 8-వే పవర్ డ్రైవర్ సీట్, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లేన్ వాచ్ కెమెరా, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ఏడీఏఎస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు. సీవీటీ వేరియంట్లలో వెనుక డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి.
ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 119 హెచ్‌పీ పవర్, 145 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఎస్‌వీ, వీ, వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్+ వేరియంట్లలో ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉంటుంది.