శివ రాజ్ కుమార్ కి తప్పిన ప్రమాదం.. వీడియో ఇదిగో!
- 'బెయిల్' సినిమా ప్రమోషన్‌లో చోటుచేసుకున్న ఘటన
- శివ రాజ్ కుమార్‌కు అత్యంత సమీపంలో పేలిన టపాసులు
- భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులను విమర్శిస్తున్న అభిమానులు
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తన కొత్త చిత్రం 'బెయిల్' ప్రమోషన్లలో భాగంగా కర్ణాటకలోని చిత్రదుర్గలో పర్యటిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానుల మధ్య నుంచి థియేటర్‌లోకి వెళుతుండగా ఆయనకు అత్యంత సమీపంలో ఓ బాణసంచా ఒక్కసారిగా పేలింది. దీంతో ఆయన ఉలిక్కిపడ్డారు.
వివరాల్లోకి వెళితే, చిత్రదుర్గలోని బసవేశ్వర థియేటర్ వద్దకు శివ రాజ్ కుమార్ రాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయన థియేటర్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో స్వాగతం పలికేందుకు సిద్ధం చేసిన బాణసంచాలో ఒకటి ఆయన పక్కనే పేలింది. వెంటనే అప్రమత్తమైన శివరాజ్ కుమార్, నిప్పురవ్వల నుంచి తనను తాను కాపాడుకునేందుకు చేతులతో ముఖాన్ని, తలను కప్పుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయనకు రక్షణగా నిలిచారు.
ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా, శివరాజ్ కుమార్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత తేరుకున్న ఆయన, ప్రమోషన్ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, భద్రతా ఏర్పాట్లపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్న శివ రాజ్ కుమార్... 'జైలర్ 2' వంటి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.