ఐఫోన్‌ డ్యుయోలో అదిరిపోయే ఫీచర్‌.. మడత గీత కనిపిస్తే డిస్‌ప్లే లేయర్‌ మార్చేస్తారట!

ఐఫోన్‌ డ్యుయోలో అదిరిపోయే ఫీచర్‌.. మడత గీత కనిపిస్తే డిస్‌ప్లే లేయర్‌ మార్చేస్తారట!

iPhone Duo feature allows replacing display layer if crease appears
  • ఐఫోన్‌ డ్యుయోలో మార్చుకోగల డిస్‌ప్లే లేయర్‌
  • మడత గీతను కప్పి ఉంచే లేయర్‌
  • అరిగిపోతే లేయర్‌ను మార్చుకునే వెసులుబాటు
  • యాపిల్‌కేర్‌+తో మార్పు ఖర్చు 19 డాలర్లు
ఫోల్డబుల్‌ ఫోన్లలో చాలాకాలంగా వేధిస్తున్న సమస్య మడత పడే చోట కనిపించే గీత. టెక్నాలజీ అభివృద్ధితో ఈ సమస్య కొంత తగ్గినా.. పూర్తిగా మాత్రం పోలేదు. ఈ సమస్యకు యాపిల్‌ కొత్త పరిష్కారం చూపించింది. కంపెనీ తొలిసారి తీసుకొస్తున్న ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ‘ఐఫోన్‌ డ్యుయో’లో మడత గీతను కప్పి ఉంచే డిస్‌ప్లే లేయర్‌ను అవసరమైతే మార్చుకునే అవకాశం కల్పించింది.

యాపిల్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేట్‌ బెర్గెరాన్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫోన్‌లోని లోపలి ఫోల్డింగ్‌ డిస్‌ప్లేపై ఉండే నానో టెక్స్చర్‌ కవర్‌ లేయర్‌ను తొలగించి కొత్తదాన్ని అమర్చుకోవచ్చని ఆమె చెప్పారు. కాలక్రమంలో ఈ లేయర్‌ అరిగిపోయినా లేదా మడత గీత స్పష్టంగా కనిపించినా.. పాత లేయర్‌ను తీసేసి కొత్తది పెట్టుకోవచ్చని తెలిపారు.

ఈ లేయర్‌ ప్రధానంగా డిస్‌ప్లే మధ్యలో కనిపించే మడత గీతను కంటికి పెద్దగా కనిపించకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. ఎక్కువకాలం మన్నేలా దీన్ని తయారు చేసేందుకు 
భారీ కసరత్తు చేసినట్లు బెర్గెరాన్‌ చెప్పారు. అయితే ఎంత జాగ్రత్తగా తయారు చేసినా కాలక్రమంలో లేయర్‌ అరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మొత్తం డిస్‌ప్లే మార్చాల్సిన అవసరం లేకుండా ఈ లేయర్‌ను మాత్రమే మార్చుకోవచ్చు.

అమెరికాలో యాపిల్‌కేర్‌+ ఉన్న ఐఫోన్‌ డ్యుయో వినియోగదారులకు ఈ లేయర్‌ మార్పు ఖర్చు 19 డాలర్లు.. అంటే సుమారు రూ.1,829గా యాపిల్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. యాపిల్‌కేర్‌+ లేకుండా ఎంత ఖర్చవుతుందో ఇంకా వెల్లడించలేదు. ఈ రీప్లేస్‌మెంట్‌ సదుపాయం యాపిల్‌ స్టోర్లు, అధీకృత సర్వీస్‌ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వినియోగదారులే ఇంట్లో ఈ లేయర్‌ను తొలగించి మార్చుకోవచ్చా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు.

ఐఫోన్‌ డ్యుయో ప్రీ-ఆర్డర్లు అక్టోబర్‌ 16న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 23 నుంచి విక్రయాలు మొదలవుతాయి. ఫోల్డబుల్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన తర్వాత కూడా ఎక్కువకాలం కొత్త ఫోన్‌లా కనిపించేలా చేయడమే ఈ మార్చుకోగల లేయర్‌ వెనుక ప్రధాన ఆలోచనగా తెలుస్తోంది.
Advertisement
iPhone Duo
Apple Foldable iPhone
Display Crease Solution
Replaceable Display Layer
iPhone Duo Release Date
AppleCare Plus

More Telugu News