మీ టైమ్ పాస్ కోసం నా పేరు వాడుకోవద్దు.. నాకు పదవులపై వ్యామోహం లేదు: బండ్ల గణేశ్
- తన పేరును వాడుకుని ఇబ్బంది పెట్టొద్దని కోరిన బండ్ల గణేశ్
- తనకు పదవులు, హోదాలపై ఎలాంటి ఆశ లేదని వెల్లడి
- మీ టైమ్‌పాస్ కోసం నా జీవితంతో ఆడుకోవద్దంటూ విజ్ఞప్తి
- చేతులెత్తి వేడుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరును అనవసర ప్రచారాలకు, చర్చలకు వాడుకోవద్దని, తన జీవితానికి అన్యాయం చేయొద్దని ఆయన చేతులెత్తి వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
తనకు ఎలాంటి పదవులపైనా, హోదాలపైనా ఆసక్తి లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. "దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఎలాంటి పదవుల మీద, హోదాల మీద, మరే విషయాల మీదా ఎలాంటి వ్యామోహం కానీ, ఆశ కానీ లేదు. లేనిపోని విషయాలు మాట్లాడి నా పేరును ఉపయోగించి నాకు ఇబ్బందులు కలిగించొద్దని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను" అని గణేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
బండ్ల గణేశ్ తాజా ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో స్పష్టత లేకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.