పాక్‌పై అభిషేక్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు!
- పాక్‌పై ఏడు సిక్సర్లతో చెలరేగిన అభిషేక్
- 3,513 బంతుల్లో 400 టీ20 సిక్సర్లు పూర్తి
- క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన అభిషేక్
- భారత్-పాక్ టీ20ల్లో అత్యధిక సిక్సర్ల ఘనత
- యువరాజ్ సింగ్ రికార్డును సమం చేసిన అభిషేక్
ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగంగా 400 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించే క్రమంలో క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టాడు. భారత్-పాక్ టీ20 మ్యాచ్ లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ నిలిచాడు.
పాకిస్థాన్‌తో ఆసియా క్రీడల స్వర్ణ పతక పోరులో అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. రెండో ఓవర్‌లోనే తొలి సిక్సర్ బాదిన అతడు.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించాడు. వరుసగా భారీ షాట్లు ఆడుతూ పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో తన నాలుగో సిక్సర్ బాదిన వెంటనే టీ20ల్లో 400 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. ఇందుకు 3,513 బంతులే తీసుకున్నాడు. గతంలో క్రిస్ గేల్ 3,557 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ 3,027 బంతులతో తొలి స్థానంలో ఉన్నాడు.
పాక్‌తో మ్యాచ్‌లో అభిషేక్ మొత్తం ఏడు సిక్సర్లు బాదాడు. దీంతో భారత్-పాక్ టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. 2012లో అహ్మదాబాద్‌లో పాక్‌పై యువరాజ్ ఏడు సిక్సర్లు బాదాడు. మరోవైపు పాక్‌పై టీ20ల్లో అభిషేక్ సిక్సర్ల సంఖ్య 14కు చేరింది. ఈ రెండు జట్ల మధ్య అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (11)ను అధిగమించాడు.
ఇక, 2026లో టీ20ల్లో 100 సిక్సర్లు బాదేందుకు అభిషేక్ 651 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ (589 బంతులు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. డెవాల్డ్ బ్రెవిస్ (653 బంతులు)ను వెనక్కి నెట్టాడు.
నేటి మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. పాక్ మాత్రం ఒక మార్పు చేసింది. మొహమ్మద్ వసీమ్ జూనియర్ స్థానంలో సాద్ మసూద్‌కు అవకాశం ఇచ్చింది. సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ 124 పరుగుల తేడాతో గెలవగా.. బంగ్లాదేశ్‌పై పాక్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.