తిరుమలలో మాడవీధుల రూపకర్త ఎవరో తెలుసా.. బ్రహ్మోత్సవాలను కొండపైకి తెచ్చిన మహనీయుడు!
- తిరుమల మాడ వీధుల రూపశిల్పి రామానుజాచార్యులు
- తిరుమల మాడ వీధులను నిర్మించి బ్రహ్మోత్సవాలకు బాటలు
- ఆలయ కైంకర్యాల పర్యవేక్షణకు జీయర్ వ్యవస్థ ఏర్పాటు
- సీతా, యోగ నరసింహ, భూదేవి అర్చామూర్తుల ప్రతిష్ఠ
- వెయ్యేళ్ల క్రితం ఆయన ప్రవేశపెట్టిన సంప్రదాయాలే నేటికీ కొనసాగింపు
- శ్రీవారికి అన్నప్రసాద నైవేద్య విధానానికి శ్రీకారం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ కీర్తి కిరీటంలో ఎన్నో కలికితురాయిలు ఉన్నాయి. వాటిలో కొన్ని వెయ్యి సంవత్సరాలుగా చెక్కుచెదరని వైభవంతో ప్రకాశిస్తున్నాయి. ఆ వైభవానికి, ఆ శాశ్వత కీర్తికి పటిష్ఠమైన పునాదులు వేసిన మహనీయులలో అగ్రగణ్యులు భగవద్ శ్రీ రామానుజాచార్యులు. టీటీడీ కథనం ప్రకారం.. సుమారు వెయ్యేళ్ల క్రితం ఆయన దూరదృష్టితో రూపొందించిన కైంకర్య వ్యవస్థ, ఆగమ సంప్రదాయాలు, ఉత్సవ విధానాలు నేటికీ తిరుమల ఆలయ నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
మాడ వీధుల నిర్మాణంతో బ్రహ్మోత్సవాలకు కొత్త శోభ
ఒకప్పుడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల కొండ కింద తిరుచానూరులో ఎనిమిది రోజుల పాటు జరిగేవని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ ఉత్సవాలను కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపైనే, స్వామివారి సన్నిధిలోనే అత్యంత వైభవంగా జరపాలనే సంకల్పం రామానుజాచార్యులది. అందుకోసం ఆయన ఆలయం చుట్టూ విశాలమైన నాలుగు మాడ వీధులను ఏర్పాటు చేశారు. ఈ వీధుల నిర్మాణంతోనే తిరుమల బ్రహ్మోత్సవాలు కొండపైకి చేరాయి. శ్రీవారి ఉత్సవమూర్తి వివిధ వాహనాలపై ఈ మాడ వీధుల్లో ఊరేగుతూ లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చే అద్భుత ఘట్టానికి అప్పుడే బీజం పడింది.
నేడు తిరుమల బ్రహ్మోత్సవాల శోభకు, భక్తుల ఆనందానికి ఈ మాడ వీధులే ప్రధాన వేదికగా నిలుస్తున్నాయి. ఇటీవల టీటీడీ ఈ వీధులకు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద మార్గాలుగా నామకరణం చేసి రామానుజుల స్ఫూర్తిని కొనసాగించింది.
కైంకర్యాల పర్యవేక్షణకు జీయర్ వ్యవస్థ
ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు, కైంకర్యాలు నిరంతరాయంగా, నిర్దిష్టంగా జరగడానికి రామానుజాచార్యులు ఒక పటిష్టమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అదే జీయర్ వ్యవస్థ. ఆలయ ఆచార వ్యవహారాలను పర్యవేక్షించేందుకు వెంకటనాథ శఠగోప యతి లేదా జీయర్ మఠాన్ని తిరుమలలో ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారానే ఆలయంలో ఆళ్వార్ల దివ్యప్రబంధంలోని 250కి పైగా పాశురాల పారాయణాన్ని ప్రవేశపెట్టారు. ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు వచ్చినప్పుడు వారికి పూర్ణకుంభ స్వాగతంతో మర్యాదలు జరిపే సంప్రదాయం కూడా ఆయన ప్రారంభించిందే. గోదా కల్యాణం, తన్నీరముదు, భగ్ సవారి వంటి ఉత్సవాలు ఆయన ప్రవేశపెట్టినవే.
అన్నప్రసాదం నుంచి అర్చామూర్తుల ప్రతిష్ఠ వరకు..
స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఆకలితో ఉండరాదనే ఉద్దేశంతో అన్నప్రసాద వితరణకు రామానుజులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాలను ఆలయ వంటశాలలోనే శ్రీవైష్ణవ సంప్రదాయ వంటవారితో శుచిగా, శుద్ధంగా తయారు చేయాలని నిర్దేశించారు. గుడాన్నం, చిత్రాన్నం, పాయసం, అప్పం వంటి అనేక ప్రసాదాలను నైవేద్యంలో చేర్చారు.
అంతేకాకుండా, ఆలయంలో కొన్ని అర్చామూర్తుల కొరతను తీర్చడంలో ఆయన పాత్ర విశిష్టమైనది. ఆలయంలో శ్రీరాముడు ఉన్నా, సీతాదేవి అర్చామూర్తి లేకపోవడాన్ని గమనించి, పంచలోహ విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అలాగే, స్వామి పుష్కరిణి సమీపంలో ఉన్న యోగ నరసింహస్వామి విగ్రహాన్ని గుర్తించి, ప్రత్యేక మండపాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు. వరాహ పురాణ ఘట్టానికి ప్రతీకగా భూదేవి అర్చామూర్తిని పూలబావిలో ప్రతిష్ఠించడం ఆయన భక్తికి, శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం.
వెయ్యేళ్లు గడిచినా, కాలక్రమేణా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నా.. రామానుజాచార్యులు నిర్దేశించిన ప్రధాన ఆగమ సంప్రదాయాలు, కైంకర్యాలు, నియమ నిబంధనలు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయాల్లో నేటికీ కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయ వ్యవస్థను క్రమబద్ధీకరించి, కైంకర్యాలకు పటిష్టమైన పునాది వేసిన రామానుజాచార్యుల సేవలు, శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఆయనకు ఉన్న అపారమైన భక్తికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి.