నా పాస్‌పోర్ట్‌ను మోదీ, అమిత్ షా అడ్డుకుంటున్నారా?: కేఏ పాల్
- వాషింగ్టన్ నుంచి కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
- పాస్‌పోర్ట్ రెన్యువల్ ఆలస్యంపై మోదీ సర్కారుకు కేఏ పాల్ ప్రశ్న
- తన నోరు విప్పితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సంచలన ఆరోపణలు చేశారు. తన పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయవద్దని వారేమైనా ఆదేశాలు జారీ చేశారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు నిలబడి రికార్డ్ చేసిన ఒక వీడియోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మూడు నెలల క్రితం పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటికీ రాకపోవడం షాక్‌కు గురిచేసిందని పాల్ తెలిపారు. మోదీ, అమిత్ షా తనకు మంచి మిత్రులని చెబుతూనే, ఈ జాప్యం వెనుక వారి ఆదేశాలు ఉన్నాయా? లేక విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమైనా చెప్పారా? అని అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్‌కు వస్తున్నాననే కారణంతో గానీ, ఎఫ్‌సీఆర్‌ఏ సమస్యల వల్ల గానీ తన పాస్‌పోర్ట్‌ను అడ్డుకుంటున్నారా? అని ఆయన నిలదీశారు.
2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయనగరంలో తనపై నమోదైన కేసును కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ ఘటనలో ఒక యువకుడు చనిపోతే, నిరసన చేస్తున్న వారిని తాను సముదాయించి పంపించానని, మంచి పని చేసినా తనపై కేసు పెట్టారని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసు ఇంకా కొట్టివేయలేదని, దాని కారణంగానే పాస్‌పోర్ట్ నిలిపివేశారా? అని ప్రశ్నించారు.
ఈ 'చిన్న' విషయంపై తాను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని, తాను నోరు విప్పితే అనవసర సమస్యలు వస్తాయని మోదీ, అమిత్ షాలను హెచ్చరించారు. న్యాయపరమైన చర్యలు తీసుకునేలోపే తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.