సెప్టెంబర్ 7న కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నా: యూట్యూబర్ రమా నందన
Advertisement

సెప్టెంబర్ 7న కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నా: యూట్యూబర్ రమా నందన

I faced a tough situation on September 7 says YouTuber Rama Nandana
  • వైరల్ అవుతున్న యూట్యూబర్ రమా నందన ఎమోషనల్ పోస్ట్
  • లుక్ అవుట్ సర్క్యులర్‌తో ఎయిర్‌పోర్టులో నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన
'నందూస్ వరల్డ్' అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా గుర్తింపు పొందిన రమా నందన పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన తన జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారని రమా నందనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓ బాధితుడు యూకే ఉద్యోగం కోసం సుమారు రూ. 15 లక్షలు చెల్లించానని ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను గుర్తించి, ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

పోలీసులు ఆమెను దాదాపు నాలుగు గంటల పాటు విచారించినట్లు సమాచారం. ప్రధానంగా 'డెస్టినీ కన్సల్టెన్సీ' వ్యవహారాలపైనే ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అయితే, ఈ కన్సల్టెన్సీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దాని వ్యవహారాలన్నీ తన భర్త మధుకర్ చూసుకుంటారని నందన గతంలోనే తెలిపారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
తాజా పోస్టులో కేసు వివరాలను ప్రస్తావించకుండా, "సెప్టెంబర్ 7న నేను నేలపై కాలుమోపినప్పుడు.. నా జీవితంలో ఓ కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను" అని మాత్రమే పేర్కొనడం గమనార్హం.

Advertisement
Rama Nandana
Nandus World
Job Fraud Case
Shamshabad Airport
Ibrahimpatnam Police
Destiny Consultancy

More Telugu News