ఖైరతాబాద్ ఉపఎన్నిక ఫలితం మాములుగా ఉండదు: దానం నాగేందర్
- ఖైరతాబాద్ ఉపఎన్నికలో నిర్ణయాత్మక ఫలితం వస్తుందని దానం జోస్యం
- ఈసీని వాడుకుని బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని విమర్శ
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
- ఉపఎన్నికలో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన దానం
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, నియోజకవర్గంలో జరగబోయే ఉపఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలో వచ్చే తీర్పు నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా దానం నాగేందర్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ 'ఓట్ల దొంగతనం' చేస్తోందని, లోక్‌సభ ఎన్నికల్లో ఇదే జరిగిందని విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఖైరతాబాద్ సీటు ఫలితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని దానం డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కోరారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.