కుమార్తె నిశ్చితార్థంపై షర్మిల భావోద్వేగ పోస్ట్.. సీఎం రేవంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
- ఇటీవల షర్మిల కుమార్తె నిశ్చితార్థం
- సోషల్ మీడియాలో స్పందించిన వైఎస్ షర్మిల
- 'వివాహ బంధానికి తొలి అడుగు' అంటూ భావోద్వేగ పోస్ట్
- వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన షర్మిల
- నవంబరు 25న వివాహం, డిసెంబరు 5న రిసెప్షన్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజిలి రెడ్డి నిశ్చితార్థం గురించి సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. "వివాహ బంధానికి తొలి అడుగు" అంటూ ఆమె ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన కుమార్తె అంజిలి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ మహోత్సవం కన్నుల పండువగా జరిగిందని తెలిపారు.
దేవుని దీవెనలు, అమ్మ ప్రేమ, నాన్న వైఎస్సార్ ఆశీస్సులతో ఇరు కుటుంబాల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని షర్మిల పేర్కొన్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు నూతన జంటను ఆశీర్వదించారని ఆమె వివరించారు. ఈ సందర్భంగా వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా, కుటుంబంతో సహా విచ్చేసి నూతన జంటను దీవించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు షర్మిల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని అందమైన క్షణాలను పంచుకుంటున్నానని చెబుతూ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. రాలేకపోయినా మంచి మనసుతో తన బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఆత్మబంధువుకి వందనం అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, సెప్టెంబరు 24న హైదరాబాద్‌లో అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహాన్ని నవంబరు 25న, వివాహ రిసెప్షన్‌ను డిసెంబరు 5న నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

.