ఓట్ల తొలగింపుపై బీజేపీ కుట్ర.. మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు
- అర్హులైన ఓటర్లకూ నోటీసులిస్తున్నారని విమర్శ
- గతంలో పలుమార్లు ఓటు వేసిన వారినీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ
- సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాలని డిమాండ్
- అర్హులందరికీ ఓటు హక్కు ఉండాలన్న మహేశ్ గౌడ్
అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. పౌరులకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
నిజామాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ డిమాండ్ చేసినట్టుగా ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. లేకపోతే వారిని ప్రభుత్వం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ దేశంలో పుట్టిన పౌరులకు, గతంలో పలుమార్లు ఓటు వేసిన వారికి కూడా నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలని అన్నారు.
నిజామాబాద్‌లో గణేశ్ నిమజ్జనం అతిపెద్ద పండుగల్లో ఒకటని మహేశ్ కుమార్ చెప్పారు. గణనాథుడిని సాగనంపుతూ రాష్ట్రం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య సహా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందాలని ఆకాంక్షించారు. మరోసారి ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్‌కు ఉండాలని కోరుకున్నామని చెప్పారు.