గణేశ్ నిమజ్జనం: 25న సెలవు, వేలాదిమంది పోలీసులతో భారీ బందోబస్తు
- గణేశ్ నిమజ్జనం సందర్భంగా 25న జీహెచ్ఎంసీ పరిధిలో సెలవు
- ఏఐ టెక్నాలజీ, డ్రోన్లతో నిమజ్జన ప్రక్రియపై ప్రత్యేక నిఘా
- నిమజ్జనం రోజు నగరంలోకి ప్రైవేట్ బస్సులు, లారీలకు అనుమతి నో
- డీజేలు, అసభ్య నృత్యాలపై కఠిన చర్యలని సీపీ హెచ్చరిక
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీన (శుక్రవారం) జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. మొత్తం 28,400 మంది సిబ్బందిని భద్రతా విధులకు కేటాయించారు.
ఈ నెల 25న నిమజ్జనం ఉండటంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీన (రెండో శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిమజ్జన ఏర్పాట్లపై సజ్జనార్
నిమజ్జన ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగర పరిధిలో 20,000 మంది, ఇతర జిల్లాల్లో 8,400 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది నిఘా కోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నామని, 24 డ్రోన్లు, 10,000 సీసీటీవీ కెమెరాల ద్వారా నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 100 హై-రైజ్ కెమెరాలు ఏర్పాటు చేశామని, చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాల కట్టడికి 25 క్రైమ్ బ్రాంచ్ బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు.
మహిళల భద్రత కోసం 'షీ టీమ్స్' నిఘాను ముమ్మరం చేశామని, ఊరేగింపుల్లో డీజేలు వినియోగం, మండపాల వద్ద అసభ్యకర పాటలు, నృత్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో పాత వీడియోలు లేదా తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయవద్దని ప్రజలకు సూచించారు. ఖైరతాబాద్ గణనాథుని దర్శన గడువు నేటి (బుధవారం) అర్ధరాత్రితో ముగియనుంది. నిమజ్జనం రోజున నగరంలోకి ప్రైవేట్ బస్సులు, భారీ ట్రక్కుల ప్రవేశానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.