ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, అత్యాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది: రేవంత్ రెడ్డి

ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, అత్యాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy vows strict action against SC ST atrocities in Telangana
  • ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష
  • ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం దళితులకు కేటాయిస్తున్నట్టు రేవంత్ వెల్లడి
  • విద్యా వికాసమే పేదరికాన్ని నిర్మూలిస్తుందని వ్యాఖ్య

తెలంగాణ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలు, సంక్షేమ పథకాల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తమ ప్రభుత్వం దళితులు, ఆదివాసీలు, గిరిజనుల సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. పేద ప్రజలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల పట్టాలు అందించిన ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే తమ ప్రజా పాలన కొనసాగుతోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో 31 శాతం దళితులకు, 17 శాతం ఎస్టీలకు మంజూరు చేసి సంక్షేమంలో పెద్దపీట వేశామని వెల్లడించారు.

   

అట్టడుగు వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న పలు విప్లవాత్మక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉదయం పూట పౌష్టికాహార బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని, అలాగే 3 కోట్ల 48 లక్షల మంది ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తూ పేద కుటుంబాలకు నాణ్యమైన భోజనాన్ని చేరవేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులు, అత్యాచార ఘటనలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. బాధితులకు అందాల్సిన నష్టపరిహార నిధులను బడ్జెట్ అడ్డంకులు లేకుండా నేరుగా ‘గ్రీన్ ఛానెల్’ ద్వారా తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యా వికాసమే పేదరికాన్ని నిర్మూలిస్తుందని, అందుకే పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని, రాజకీయాలకు అతీతంగా ఈ వర్గాల పురోగతికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

Advertisement
Revanth Reddy
Telangana Government
SC ST Atrocity Act
Dalit Welfare Schemes
Indiramma Houses
Green Channel Compensation

More Telugu News