ఆ వందల ఎకరాల్లో మా వాటా ఎక్కడుందో కేటీఆర్ చెప్పాలి: రమ్యారావు

ఆ వందల ఎకరాల్లో మా వాటా ఎక్కడుందో కేటీఆర్ చెప్పాలి: రమ్యారావు

Ramya Rao asks KTR to reveal our share in hundreds of acres of land
  • పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డంగా దోచుకుందన్న రమ్యారావు
  • కేటీఆర్ కు సంతోశ్ రావు బినామీ అని ఆరోపణ
  • చెప్పులు కూడా లేని సంతోశ్ రావుకు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన ప్రజా పాలన అందిస్తుంటే, ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు 22ఏ పేరిట రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు, కేసీఆర్ సొంత అన్న కూతురు రమ్యారావు మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా ఆస్తులు దోచుకుందని ధ్వజమెత్తారు. 


గతంలోనే తమకు వందల ఎకరాల భూములు ఉన్నాయని ప్రకటనలు చేస్తున్న కేటీఆర్.. అందులో మా వాటా ఎక్కడుందో చెప్పాలని రమ్యారావు డిమాండ్ చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోశ్ రావు కేటీఆర్‌కు బినామీ కాబట్టే ఆయన ఆస్తులపై ప్రశ్నించకుండా మౌనంగా ఉంటున్నారా? అని ప్రశ్నించారు.


గతంలో చెప్పులు వేసుకునే పరిస్థితి కూడా లేని సంతోశ్ రావుకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో భవనం, కొండాపూర్, మార్కుక్ ప్రాంతాల్లో వందల ఎకరాల భూములు, నానక్‌రామ్‌గూడలో ఆయన భార్య రోహిణి పేరిట భారీ కమర్షియల్ భవనాలు ఎలా వచ్చాయని నిలదీశారు. ప్రాజెక్టుల ముంపు పేరుతో కుదురుపాక గ్రామానికి సంబంధం లేని సంతోశ్ కుటుంబ సభ్యులు అక్రమంగా 8 ఇళ్ల ప్లాట్లను పొందారని, అయితే 2018 రాజ్యసభ అఫిడవిట్‌లో కేవలం ఒక్క ప్లాట్‌ను మాత్రమే చూపి సమాచారాన్ని దాచారని ఆరోపించారు. కేసీఆర్ దగ్గర ఉంటూ అడ్డగోలుగా సంపాదించిన సంతోశ్ రావును వెనకేసుకొస్తూ... కవితను, ఇంటి నుంచి బయటకు పంపిన వైనంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని రమ్యారావు సవాల్ విసిరారు.

Advertisement
Ramya Rao
KTR
Santosh Kumar
BRS Corruption
Telangana Politics
KCR Family Assets

More Telugu News