డీఎస్సీ చేపట్టడం ఓర్వలేకే టీచర్లపై దాడులు.. వైసీపీపై మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి ఫైర్

డీఎస్సీ చేపట్టడం ఓర్వలేకే టీచర్లపై దాడులు.. వైసీపీపై మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి ఫైర్

Gottipati Ravi Kumar and Eluri Sambasiva Rao slam YSRCP over attack on teachers
  • విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు వర్సెస్ వైసీపీ శ్రేణులు
  • దాడి ఘటనను తీవ్రంగా పరిగణించామన్న మంత్రి గొట్టిపాటి
  • దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • డీఎస్సీని ఓర్వలేకే వైసీపీ దాడులని నేతల విమర్శ
  • జగన్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఏలూరి ఆరోపణ
  • లోకేశ్ కు మంచి పేరు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శలు
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులపై రౌడీ మూకలతో దాడులు చేయించడం అత్యంత దారుణమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. అధికారం ఉన్నా లేకపోయినా వైసీపీ దాడుల సంస్కృతిని వీడటం లేదని విమర్శించారు. ఎన్నో సవాళ్లను అధిగమించి కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేపడుతుంటే, దానిని ఓర్వలేకనే వైసీపీ ఇలా దాడులకు దిగుతోందని ఆరోపించారు. ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ చర్యను ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. గతంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన జగన్‌కు ఇప్పుడు వారిపై దాడులు చేయిస్తున్నారని గొట్టిపాటి ధ్వజమెత్తారు.

ఇదే ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రంగా స్పందించారు. ప్రకాశం, గుంటూరు, విజయవాడకు చెందిన రౌడీషీటర్లను సమీకరించి, స్వయంగా జగనే ఈ దాడి చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులు తమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయం కోరేందుకు వస్తే, వారిపై దాడి చేయడం వైసీపీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. 

గత ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వైసీపీ, ఇప్పుడు డీఎస్సీని అడ్డుకునేందుకు కేసులు వేసి విఫలమై, భౌతిక దాడులకు దిగుతోందని విమర్శించారు. నారా లోకేశ్‌కు వస్తున్న మంచి పేరును తట్టుకోలేకే జగన్ ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఏలూరి ఆరోపించారు. ఈ దాడిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Gottipati Ravi Kumar
Eluri Sambasiva Rao
YSRCP attack on teachers
Vijayawada SAAP office incident
Andhra Pradesh DSC recruitment
YS Jagan Mohan Reddy

More Telugu News