రేవంత్ పిలుపు.. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన దర్శకుడు సందీప్ వంగా
- వరంగల్ ఎయిర్‌పోర్ట్ పేరుపై స్పందించిన సినీ ప్రముఖులు
- 'రుద్ర', 'కాకతీయ' పేర్లను ప్రతిపాదించిన దర్శకుడు సందీప్ వంగా
- 'సమ్మక్క-సారలమ్మ' పేరును సూచించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
- 'రాణి రుద్రమదేవి' పేరు బాగుంటుందన్న బండ్ల గణేష్
- ప్రాంతీయ అభివృద్ధికి ప్రాజెక్టు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాల హర్షం
వరంగల్‌లో కొత్తగా నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి తగిన పేర్లను సూచించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుపై సినీ పరిశ్రమ నుండి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా, వరంగల్ బిడ్డ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ క్రమంలో రెండు పేర్లను ప్రతిపాదించారు. తన సొంత పట్టణంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కానుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
వరంగల్ చారిత్రక వైభవాన్ని, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయానికి పేరు ఉండాలని సందీప్ వంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, 'రుద్రమ అంతర్జాతీయ విమానాశ్రయం (RIA)', 'కాకతీయ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)' అనే పేర్లను ఆయన ప్రతిపాదించారు. వరంగల్ వాసుల చిరకాల స్వప్నమైన ఈ ప్రాజెక్టును సాకారం చేస్తున్నందుకు ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
సందీప్ వంగాతో పాటు టాలీవుడ్‌కు చెందిన మరికొందరు ప్రముఖులు సైతం ఈ అంశంపై స్పందించారు. 'దసరా' చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 'సమ్మక్క-సారలమ్మ అంతర్జాతీయ విమానాశ్రయం' పేరును ప్రతిపాదించగా, నటుడు మరియు నిర్మాత బండ్ల గణేశ్ 'రాణి రుద్రమదేవి అంతర్జాతీయ విమానాశ్రయం, వరంగల్' అనే పేరు సముచితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) సైతం విమానాశ్రయ నిర్మాణ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, వరంగల్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లకు మరింత వెసులుబాటు, ప్రోత్సాహం లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.