జన్వాడ ఫాంహౌస్ నాలాపై కట్టిన అక్రమ నిర్మాణమే: కాంగ్రెస్ ఎంపీలు

జన్వాడ ఫాంహౌస్ నాలాపై కట్టిన అక్రమ నిర్మాణమే: కాంగ్రెస్ ఎంపీలు

Janwada Farmhouse is an illegal construction built on a nala say Congress MPs
  • జన్వాడ ఫాంహౌస్ ను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీలు
  • ఈ ఫాంహౌస్ నిర్మాణానికి అనుమతులు లేవన్న ఎంపీ చామల
  • అసలు యజమాని ఎవరనే దానిపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్య

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని వివాదాస్పద ఫాంహౌస్‌ను (కేటీఆర్ ఫాంహౌస్ గా ఆరోపణలు) కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందం ఈరోజు నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగి కాంగ్రెస్ బృందాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ పరిశీలన అనంతరం మాట్లాడిన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి... జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, మురుగునీటి కాలువ (నాలా) పైనే ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారని సంచలన ఆరోపణలు చేశారు.


ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా విస్తరించిన ఈ ఫాంహౌస్ భూముల వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు దాగి ఉన్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ స్నేహితుడైన ప్రదీప్ రెడ్డి పేరుతో ఈ భూములు ఉన్నప్పటికీ, అసలు యజమానులెవరనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. 


గతంలో సత్యం రామలింగరాజుకు చెందిన భూముల్లోనే ఈ ఫాంహౌస్ నిర్మించారని, శతబిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఉన్న ఈ స్థలాల్లో కేటీఆర్ అర్ధాంగి శైలిమతో పాటు ఆయన అత్తగారి పేరిట కూడా భూములు ఉన్నాయని ఆరోపించారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్న హయాంలో తన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహించారని, గతంలో ఈ ఫాంహౌస్ దగ్గర డ్రోన్ కెమెరా ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు.

Advertisement
Janwada Farmhouse
KTR
Mallu Ravi
Chamala Kiran Kumar Reddy
Illegal Construction
Telangana Congress

More Telugu News