తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పట్నించి అంటే...!
- తెలంగాణలో పాఠశాలలకు SA-1 పరీక్షల షెడ్యూల్ విడుదల
- అక్టోబర్ 1 నుంచి 9 వరకు సమ్మేటివ్-1 పరీక్షలు
- అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు
- వివిధ తరగతులకు వేర్వేరు సమయాల్లో పరీక్షల నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షల షెడ్యూల్‌తో పాటు దసరా సెలవులను విద్యాశాఖ వెల్లడించింది. దీని ప్రకారం, అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు SA-1 పరీక్షలు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల నిర్వహణలో సౌలభ్యం కోసం తరగతుల వారీగా వేర్వేరు సమయాలను కేటాయించారు.
పరీక్షల సమయాల వివరాలు ఇలా ఉన్నాయి:
1 నుంచి 5వ తరగతి వరకు: విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
6, 8వ తరగతులకు: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
7వ తరగతికి మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు
9వ తరగతికి మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు
10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
కాగా, తరగతుల వారీగా ఆయా సబ్జెక్టుల పరీక్ష తేదీలతో కూడిన పూర్తి స్థాయి కూడిన టైమ్ టేబుల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పరీక్షలకు సన్నద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.