‘మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు?’.. పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు
- అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రశ్నలు
- పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై నకిలీ ఎన్‌ఓసీ ఆరోపణ
- గంగుల కమలాకర్ భూములపైనా మంత్రి వ్యాఖ్యలు
- 22ఏలో నాలుగు లక్షల ఎకరాలే పట్టా భూములని వెల్లడి
- 47,440 ఎకరాలు తగ్గించినట్లు ప్రభుత్వం వెల్లడి
మాజీ మంత్రి హరీశ్‌రావుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పేనని, అలాంటప్పుడు తన మామ భూముల విషయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని హరీశ్‌రావును ప్రశ్నించారు. ‘‘అప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది?’’ అని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన పొంగులేటి.. తన మామ భూములకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్‌ఓసీ ఇచ్చిందన్న హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించారు. అసైన్డ్ భూములకు అనుమతి ఇవ్వడం చట్టబద్ధం కాదని, ఏ ప్రభుత్వం అలా చేసినా తప్పేనని అన్నారు. ఆ విషయం హరీశ్‌రావుకు తెలియదా? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూదాన్ భూమిని నకిలీ ఎన్‌ఓసీతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పొంగులేటి ఆరోపించారు. అది కూడా తప్పేనని అన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఏ సర్కార్ రిజిస్ట్రేషన్ చేసినా అది తప్పేనని స్పష్టం చేశారు.
22ఏ నిషేధిత జాబితాపైనా పొంగులేటి కీలక వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో ఉన్న భూముల్లో సుమారు నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే పట్టా భూములని, మిగిలిన భూమంతా ప్రభుత్వ భూమేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి 47,440 ఎకరాలు తగ్గించినట్లు అసెంబ్లీలో ఇప్పటికే వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడతామని పొంగులేటి తెలిపారు. 22ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోనుందని చెప్పారు.