నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్ ముప్పు?.. ఆందోళన వద్దన్న నిపుణులు.. కానీ!
- నెయిల్ పాలిష్‌లోని కొన్ని రసాయనాలతో క్యాన్సర్ ముప్పు
- ఫార్మాల్డిహైడ్, టోలిన్, డీబీపీ వంటి వాటితో ప్రమాదం
- జెల్ మానిక్యూర్‌లోని యూవీ ల్యాంపులతో చర్మ కణాలకు హాని
- '3-ఫ్రీ', '5-ఫ్రీ' లేబుల్స్ చూసి కొనాలని నిపుణుల సలహా
మహిళలు అందం కోసం వాడే నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ వస్తుందా? ఈ సందేహం చాలామందిలో ఉంది. అయితే, నెయిల్ పాలిష్ వాడకం నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదని, కానీ కొన్ని రకాల పాత నెయిల్ పాలిష్‌లలో వాడే రసాయనాల వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెయిల్ పాలిష్ కొనుగోలు చేసేటప్పుడు, వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను సులభంగా అధిగమించవచ్చని సూచించారు.
ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్, టోలిన్, డైబ్యూటైల్ థాలేట్ (డీబీపీ) అనే మూడు రసాయనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఫార్మాల్డిహైడ్‌ను 'గ్రూప్ 1' క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వాడేవారికి ప్రమాదం తక్కువే అయినా, రోజూ సెలూన్లలో పనిచేస్తూ ఈ రసాయనాలను పీల్చేవారికి నాసోఫారింజియల్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఫార్మాల్డిహైడ్ రెసిన్, కర్పూరం, జైలీన్ వంటి ఇతర రసాయనాలతోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇటీవల ప్రాచుర్యం జెల్ పాలిష్‌ను ఆరబెట్టడానికి ఉపయోగించే యూవీ ల్యాంపుల కాంతి, చర్మ కణాలలో డీఎన్ఏ మార్పులకు కారణం కావచ్చని 2023లో జరిగిన ఒక ల్యాబ్ అధ్యయనంలో తేలిందని నిపుణులు గుర్తుచేశారు. అయితే, దీనిపై మానవులపై ఆధారాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయని, పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముందుజాగ్రత్తగా యూవీ ల్యాంప్ కింద చేతులు పెట్టేముందు సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.
ఈ కారణాల వల్ల నెయిల్ పాలిష్ వాడకాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బదులుగా తెలివైన ఎంపికలు చేసుకోవాలని సూచించారు. నెయిల్ పాలిష్ కొనేటప్పుడు దాని లేబుల్‌ను జాగ్రత్తగా చదవాలన్నారు. ఫార్మాల్డిహైడ్, టోలిన్, డీబీపీ లేని '3-ఫ్రీ' ఉత్పత్తులను ఎంచుకోవాలని చెప్పారు.
వీలైతే, ఫార్మాల్డిహైడ్ రెసిన్, కర్పూరం కూడా లేని '5-ఫ్రీ' లేదా మరిన్ని హానికారక పదార్థాలు లేని '10-ఫ్రీ' ఫార్ములాలను ఎంచుకోవడం ఇంకా సురక్షితమని తెలిపారు. తక్కువ రసాయనాలు వాడే బ్రాండ్లను ఎంచుకోవడం, వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం, తరచూ కాకుండా గోళ్లకు కాస్త విరామం ఇవ్వడం వంటివి చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని నిపుణులు వివరించారు.