కుమార్తెతో కలిసి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను
- ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ
- ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను
- వెంటనే చంద్రబాబును కలిసిన వైనం
- కండువా కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
- చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరిన వైనం
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీలో ప్రకంపనలు రేగాయి. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర, అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రులు కళావెంకట్రావు, కోండ్రు మురళీ, సుజయ్ కృష్ణ రంగారావు, ఎంపీ అప్పలనాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు. ఈ పరిణామం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
టీడీపీలో చేరడానికి ముందు చిన్న శ్రీను వైసీపీకి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ కు లేఖ పంపారు. ప్రస్తుతం చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో పార్టీ కీలక బాధ్యతల్లో చురుగ్గా పనిచేశారు.
బొత్స కుటుంబం నుంచి కీలక నేతగా ఉన్న చిన్న శ్రీను పార్టీ వీడటం వైసీపీకి, ప్రత్యేకించి బొత్స సత్యనారాయణకు రాజకీయంగా పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చిన్న శ్రీను, తన మేనమామ బొత్స సత్యనారాయణతో ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలేనని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో, విజయనగరం జిల్లాపై పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న వైసీపీకి చిన్న శ్రీను నిష్క్రమణ ఇబ్బందికర పరిణామం. మరోవైపు, ఆయన చేరికతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడినట్లయింది. ఈ పరిణామం రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.