ఓటీటీకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. 'పంచనామా'
- 'ప్రేమిస్తే' సినిమాతో పాప్యులర్ అయిన భరత్
- విలక్షణమైన పాత్రలతో బిజీగా ఉన్న నటుడు
- 'పంచనామా' సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు
- సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్
భరత్ కథానాయకుడిగా ఒక తెలుగు సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 'ప్రేమిస్తే' సినిమాతో పాప్యులర్ అయిన భరత్, ఆ తరువాత తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలాంటి భరత్ చేసిన వెబ్ సిరీస్ 'పంచనామా'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సిరీస్ ఇది. 6 ఎపిసోడ్స్ గా 'జీ 5' ద్వారా ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భరత్ ఈ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కొంతకాలం క్రితం ఒకే రోజున చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన కేసుల ఫైల్ ను మూసేస్తారు. రోడ్డు ప్రమాదం కారణంగానే వాళ్లంతా చనిపోయారని భావిస్తారు. అయితే వాళ్ల కుటుంబ సభ్యులు వచ్చి చెప్పిన కథనం ప్రకారం, అవి హత్యలై ఉండొచ్చని భరత్ భావిస్తాడు. తాను రిలీవ్ తీసుకోవడానికి రెండు రోజుల సమయమే ఉంటుంది. ఈ రెండు రోజులలో ఆయన ఈ కేసులను ఎలా పరిష్కరిస్తాడు? అనేదే కథ.
ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్న ఈ సిరీస్ ను, మిద్దె విజయేంద్ర మౌళితో కలిసి ఉదయభాను నిర్మించారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో, శివాజీరాజా .. రూపలక్ష్మి .. సూర్య .. రాధికప్రీతి తదితరులు కనిపిస్తారు. సాధారణంగా ఈ తరహా జోనర్ కి సంబంధించిన సిరీస్ లను తమిళ .. మలయాళ దర్శకులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరిస్తారు. ఇక తెలుగులో రూపొందిన ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆడియన్స్ ను అలరిస్తుందనేది చూడాలి.