యాపిల్ ప్రియులకు షాక్? భారీగా పెరగనున్న ఐఫోన్ 18 ధరలు
- భారత్‌లో రూ. 2 లక్షలు దాటనున్న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ టాప్ మోడల్ ధర
- రూ. 1.55 లక్షల నుంచి ప్రారంభం కానున్న బేస్ వేరియంట్
- కొత్త 2nm చిప్, కెమెరా అప్‌గ్రేడ్లతో పెరగనున్న ఖరీదు
ఆపిల్ ఐఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 సిరీస్ లాంచ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరలపై టెక్ వర్గాల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈసారి టాప్ మోడల్ ధర భారత్‌లో రూ. 2 లక్షల మార్కును దాటవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
టెక్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1.55 లక్షల నుంచి రూ. 1.60 లక్షల మధ్య ఉండవచ్చు. అయితే, అధిక స్టోరేజ్ వేరియంట్లు, ముఖ్యంగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 2 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే ఈసారి ధరలు సుమారు రూ. 5,000 నుంచి రూ. 20,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది మెమరీ చిప్‌లు, ఇతర విడిభాగాల ధరలు భారీగా పెరగడం, టీఎస్‌ఎంసీకి చెందిన సరికొత్త 2nm చిప్ టెక్నాలజీని వినియోగించడం, కెమెరా విభాగంలో కీలక అప్‌గ్రేడ్లు వంటి కారణాల వల్ల ధరలు పెరగనున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఇక, సెప్టెంబర్ 9న నిర్వహించనున్న ఆపిల్ ఈవెంట్‌లో ప్రో మోడల్స్‌తో పాటు, కంపెనీ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ఆవిష్కరించవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనికి 'ఐఫోన్ డ్యుయో' అనే పేరు పెట్టవచ్చని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఆపిల్ సంస్థ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.