సోషల్ మీడియాను ఎంతమంది యాక్టివ్ గా వాడుతున్నారు?: టీడీపీ నేతలను ప్రశ్నించిన లోకేశ్
- సోషల్ మీడియా వినియోగంపై టీడీపీ నేతలకు నారా లోకేశ్ దిశానిర్దేశం
- ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
- ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో తిప్పికొట్టాలని పిలుపు
- ప్రధాని మోదీని, తనను ఉదాహరణగా చూపుతూ నేతలకు దిశానిర్దేశం
- అమరావతి అభివృద్ధిని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశం
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో రెండో రోజు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. 'పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్' అనే అంశంపై మాట్లాడుతూ, ఆయన నేరుగా సభికులను "మీలో ఎంతమంది సోషల్ మీడియాను చురుకుగా వినియోగిస్తున్నారు?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతోనే సాంకేతికతను రాజకీయ ప్రచారానికి వాడుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.
"సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. దీనిపై చాలా సీరియస్‌గా ఉండాలి" అని లోకేశ్ నేతలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయాలని ఆయన సూచించారు. చిన్న స్థాయి నాయకులైన ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేస్తున్న పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తున్నారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ఉదాహరణగా చూపారు. ప్రధాని మోదీ సైతం తన సందేశాలను సెల్ఫీ వీడియోల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారం వంటి అంశాలపై సెల్ఫీ వీడియోలు తీసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచానని తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత నేతలపై ఉందని అన్నారు.
ప్రతిపక్షాల తీరుపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షం పని కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమేనని, వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ నాయకుడు 'జగన్ మావిగన్' అంటే గుడ్డిగా సమర్థిస్తున్నారని, కానీ టీడీపీ అలా కాకుండా వాస్తవాలతో ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.