బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో తీర్మానం
- తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ
- స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం
- కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తీర్మానంలో డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాల కాలం మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాతా మధు, నవీన్ కుమార్‌లపై కాంగ్రెస్ పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
తీర్మానం ప్రవేశపెట్టిన దామోదర
స్పీకర్‌పై అగౌరవంగా మాట్లాడటంతో పాటు, అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ, ఎస్సీల చరిత్ర జాతీయ ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని, దానిని కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయకూడదని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, కానీ రాజ్యాంగబద్ధమైన పదవులను, వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని స్పష్టం చేశారు. "స్పీకర్ పదవి ఏ ఒక్క కులానికో, మతానికో సంబంధించినది కాదు. ఆ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడం క్షమించరాని నేరం" అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గలేదని, ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు.
మంత్రి దామోదర ప్రవేశపెట్టిన తీర్మానానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పూర్తి మద్దతు తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం, అధికారిక కాపీని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై మండలిలో చర్యలు తీసుకున్నారు.