వైసీపీకి రాజీనామా చేసిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను
- విజయనగరం వైసీపీలో కీలక పరిణామం
- వైసీపీని వీడిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను
- జగన్‌కు రాజీనామా లేఖ పంపిన వైనం
- విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన చిన్న శ్రీను
- వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా
- అధినేత జగన్‌కు లేఖ పంపిన మజ్జి శ్రీనివాసరావు
వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. ఈ పరిణామం ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
మజ్జి శ్రీనివాసరావు తన రాజీనామా లేఖలో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తాను నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే చిన్న శ్రీను అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఉత్తరాంధ్రలో గట్టి పట్టుంది. అలాంటి కీలక నేత మేనల్లుడే పార్టీని వీడటం వైసీపీకి తీవ్ర నష్టంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో కీలకమైన జడ్పీ ఛైర్మన్ పదవిలో ఉంటూ, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేత రాజీనామా చేయడం వెనుక కారణాలపై పార్టీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, తన రాజీనామాకు గల కారణాలను చిన్న శ్రీను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.