ఆ ఒక్కడి వల్లే సర్వనాశనం.. నన్ను ఘోరంగా అవమానించారు.. పీసీబీ డబ్బులు కూడా ఎగ్గొట్టింది: పాక్ క్రికెట్‌పై గిలెస్పీ బాంబు
- పాక్ మాజీ టెస్టు కోచ్ జాసన్ గిలెస్పీ సంచలన ఆరోపణలు
- చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వల్లే పాక్ క్రికెట్ నాశనమవుతోందని విమర్శ
- తనను తీవ్రంగా అవమానించి, అధికారాలన్నీ లాక్కున్నారని ఆవేదన
- పీసీబీ ఇప్పటికీ తనకు వేల డాలర్లు బకాయిపడిందని వెల్లడి
- ఆకిబ్ ఉన్నంతకాలం పాక్ క్రికెట్ బాగుపడదని గిలెస్పీ జోస్యం
పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్టు కోచ్‌గా కొద్దికాలం పనిచేసిన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ పేసర్ జాసన్ గిలెస్పీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై, ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్‌పై సంచలన ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. ఆకిబ్ జావేద్ నియామకం తర్వాత తన పరిస్థితి దారుణంగా మారిందని, తనను తీవ్రంగా అవమానించి అధికారాలన్నీ లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుత దుస్థితికి ఆకిబ్ జావేదే కారణమని, అతను ఉన్నంతకాలం ఆ జట్టు బాగుపడదని అన్నాడు.
'ది టెలిగ్రాఫ్'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గిలెస్పీ మాట్లాడుతూ.. "పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ.. ఆకిబ్ జావేద్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్‌తో నా సంబంధం పూర్తిగా దెబ్బతింది. ఆకిబ్ వచ్చి అన్ని విషయాల్లోనూ తనే సర్వం అయ్యాడు. ప్రతిదీ తన నియంత్రణలోనే ఉండాలని చూశాడు" అని తెలిపాడు.
ఈ అనుభవం తనను మానసికంగా ఎంతగా కుంగదీసిందో గిలెస్పీ వివరించాడు. "టెస్టు జట్టును చూసుకోవడం, ఆటగాళ్లు, సిబ్బందిని నిర్వహించడం, జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించడం వంటి బాధ్యతల నుంచి నన్ను పూర్తిగా తప్పించారు. ఏ విషయంలోనూ నాకు ఎలాంటి పాత్ర లేకుండా చేశారు. ఈ మొత్తం అనుభవం నన్ను నీరుగార్చింది. కోచింగ్‌పైనే విరక్తి కలిగింది. అసలు ఈ క్రీడలో కొనసాగాలా? వద్దా? అనేంతగా నన్ను నేను అనుమానించుకునేలా చేసింది" అని తన ఆవేదన వ్యక్తం చేశాడు.
డబ్బులు కూడా ఎగ్గొట్టారు
పీసీబీ తనకు ఇప్పటికీ వేల డాలర్ల పారితోషికం బకాయి ఉందని గిలెస్పీ ఆరోపించాడు. "పీసీబీ నాకు ఇంకా వేల డాలర్లు ఇవ్వాలి. కానీ, నేను ఎప్పటికీ వాళ్లు చెప్పినదానికి తలూపే వ్యక్తిని కాలేను. నా కెరీర్‌లో ఎప్పుడూ నా సిద్ధాంతాలతో రాజీపడలేదు. ఇక్కడా నా వైఖరి మార్చుకోలేదు. నేను మౌనంగా ఉండి, వాళ్లు చెప్పినదానికల్లా అంగీకరిస్తే నా జీతం నాకు వచ్చేది. కానీ, అది నా నైజం కాదు. ఎలాగూ నన్ను రెండు మూడు నెలల్లో తొలగిస్తారని నాకు ముందే తెలుసు" అని అన్నాడు.
ఆకిబ్ జావేద్‌పై తీవ్ర ఆరోపణలు
ఆకిబ్ జావేద్ తన వెనుక గోతులు తవ్వాడని గిలెస్లీ ఆరోపించాడు. "ఆకిబ్ నా వెనుక నా గురించి చెడుగా మాట్లాడుతున్నాడని పాక్ క్రికెట్‌లోని వాళ్లే చెప్పారు. అతను నా గురించి నెగటివ్‌గా మాట్లాడటం ఆపకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోవడం గురించి ఆలోచిస్తాను" అని హెచ్చరించాడు.
"నన్ను తీవ్రంగా అవమానించారు, నా ప్రాధాన్యతను తగ్గించారు. దీనికి కారణం ఆకిబ్ జావేద్. మా తొలి సమావేశంలోనే అతను దర్పం ప్రదర్శిస్తూ, తానే బాస్ అని చూపించుకోవడానికి ప్రయత్నించాడు. అతని ఆలోచనలకు నేను ఎదురుచెప్పినప్పటి నుంచి మా మధ్య సయోధ్య కుదరలేదు. ఛైర్మన్, బోర్డు మద్దతు ఉండటంతో అతనికి ఎదురులేకుండా పోయింది. ఇతరుల అభిప్రాయాలను అతను అస్సలు పరిగణనలోకి తీసుకోడు. అది అతని మార్గం లేదా రాజమార్గం అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో నేను పనిచేయలేను" అని గిలెస్పీ స్పష్టం చేశాడు.
పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు. "ప్రస్తుతం అక్కడ జరుగుతున్నది చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. అసలు సమస్య ఆకిబ్ జావేద్. అతను అక్కడ ఉన్నంతకాలం పాక్ క్రికెట్ వెనక్కి వెళుతుందే తప్ప ముందుకు పోదు. సరైన కోచ్‌ను ఎంపిక చేసి, అతనికి సమయం ఇచ్చి, కెప్టెన్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఇస్తేనే పాక్ క్రికెట్ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది" అని గిలెస్పీ సూచించాడు.