మన మెదడులో 10 శాతమే వాడుతున్నామా? ఏళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ వాదనలో నిజమెంత?
- మెదడులో 10 శాతమే వాడుతున్నామనేది అపోహ
- మిగతా 90 శాతం ఖాళీగా ఉందనడానికి లేని ఆధారాలు
- తక్కువ చురుకుదనం అంటే ఆ భాగం నిరుపయోగమని కాదు.
- నిద్రలోనూ మెదడు పూర్తిగా పనిచేయడం ఆపదు
- మెదడు ఆరోగ్యంగా ఉండడంలో జీవనశైలిది కీలక పాత్ర
‘మనిషి తన మెదడులో కేవలం 10 శాతమే ఉపయోగిస్తున్నాడు.. మిగతా 90 శాతం ఖాళీగానే ఉంటుంది!’ ఈ మాట ఎప్పుడో విన్నట్టే ఉంది కదా! సినిమాల్లోనూ వినిపిస్తుంటుంది. మోటివేషనల్ స్పీకర్లు కూడా చెబుతుంటారు. నిజంగా మనం మన మెదడు అంత వరకే వాడుతున్నామా? దాన్ని పూర్తిగా ఉపయోగించగలిగితే అద్భుతమైన తెలివితేటలు సొంతమవుతాయా? శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. 10 శాతం మెదడునే వాడుతున్నామన్న మాటకు అసలు శాస్త్రీయ ఆధారమే లేదని చెబుతున్నారు.
10 శాతం మాట ఎలా పుట్టింది?
మెదడుపై శాస్త్రీయ అవగాహన అంతగా లేని రోజుల్లో ఏర్పడిన కొన్ని అపోహల నుంచి ఈ వాదన పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత పుస్తకాలు, సినిమాలు, స్వయం ప్రేరణకు సంబంధించిన ప్రచారం దీన్ని జనాల్లోకి మరింత తీసుకెళ్లింది. మనలో తెలియని అపారమైన శక్తి దాగి ఉందనే ఆలోచన అందరికీ ఆసక్తికరంగా అనిపించడంతో ఈ మాట బాగా ప్రాచుర్యం పొందింది.
మెదడు ఏం చేస్తుందంటే..
మన మెదడు ఒకేసారి ఎన్నో పనులను సమన్వయం చేస్తుంది. మనం కదలడం, చూడటం, వినడం, మాట్లాడటం, గుర్తుంచుకోవడం, భావోద్వేగాలను అనుభవించడం.. ఇలా ప్రతి పనిలోనూ మెదడులోని వివిధ భాగాలు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాదు.. శ్వాస, గుండె కొట్టుకునే విధానం వంటి మన ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియలను కూడా మెదడు నియంత్రిస్తుంది.
ముంబయిలోని గ్లెనీగిల్స్ ఆసుపత్రి న్యూరాలజీ, స్ట్రోక్, న్యూరోక్రిటికల్ కేర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పంకజ్ అగర్వాల్ చెప్పిన వివరాల ప్రకారం.. మనం ఏ పని చేస్తున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? ఎలా స్పందిస్తున్నాం? అనే దాన్ని బట్టి మెదడులోని వివిధ ప్రాంతాలు చురుగ్గా పనిచేస్తాయి. ఫంక్షనల్ ఎంఆర్‌ఐ వంటి సాంకేతికతలతో ఈ మార్పులను గుర్తించవచ్చు.
తక్కువగా పనిచేస్తే.. ఖాళీగా ఉన్నట్టేనా?
ఇక్కడే ‘10 శాతం’ అపోహకు అసలు చిక్కు ఉంది. మెదడులోని ఓ భాగం ఒక నిర్దిష్ట సమయంలో తక్కువ చురుకుదనంతో ఉందంటే.. అది నిరుపయోగంగా ఉందని అర్థం కాదు. మనం చేసే పనిని బట్టి మెదడులోని వేర్వేరు నెట్‌వర్క్‌లు పనిచేస్తుంటాయి. అవసరానికి అనుగుణంగా వాటి చురుకుదనం మారుతుంది.
నిద్రపోయినప్పుడు కూడా మెదడు పూర్తిగా విశ్రాంతిలోకి వెళ్లదు. నిద్ర, మెలకువ దశల్లో మెదడు పనితీరులో వచ్చే మార్పులను పరిశోధకులు ఫంక్షనల్ ఎంఆర్‌ఐ వంటి పద్ధతులతో అధ్యయనం చేస్తున్నారు.
మెదడు శక్తిని పెంచుకోవాలంటే..
‘మిగతా 90 శాతాన్ని మేల్కొలపాలి’ అనే ఆలోచనకు సైన్స్‌లో చోటు లేదు. మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు మన రోజువారీ జీవనశైలే కీలకం. తగినంత నిద్ర, క్రమం తప్పని శారీరక వ్యాయామం, పోషకాహారం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించడం ఉపయోగపడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆలోచించడం, సమస్యలను పరిష్కరించే అలవాట్లు కూడా మెదడు పనితీరుకు మేలు చేస్తాయి.