విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’ విడుదల తేదీ మారింది.. థియేటర్లలోకి ఎప్పుడంటే..!
- ‘రణబాలి’ కొత్త రిలీజ్ డేట్ అక్టోబర్ 16
- సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో మార్పు
- ప్రధాన పాత్రల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
- ‘రణబాలి’గా విజయ్, ‘జయమ్మ’గా రష్మిక
- ప్రతినాయకుడిగా ఆర్నాల్డ్ వోస్లూ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదల తేదీ మారింది. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన మేకర్స్.. ఇప్పుడు అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ గురువారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. “మన చరిత్రలోని చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోనుంది” అంటూ అక్టోబర్ 16న ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్ ఉంటుందని ప్రకటించింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పాత్రలో కనిపించనుండగా.. రష్మిక మందన్న అతడి భార్య జయమ్మగా నటిస్తోంది. ‘ది మమ్మీ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో ప్రతినాయకుడు ‘సర్ థియోడోర్ హెక్టర్’గా కనిపించనున్నారు.
19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా కథను రూపొందించినట్లు సమాచారం. భారతదేశ చరిత్రలో ప్రధాన స్రవంతి పుస్తకాల్లో పెద్దగా ప్రస్తావనకు రాని కొన్ని ఘటనలను ఈ సినిమాలో చూపించనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
1850-1900 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ.. ‘రణబాలి’ బయోపిక్ కాదని, పాఠ్యపుస్తకంలోని చరిత్రను యథాతథంగా చూపించే సినిమా కూడా కాదని సమాచారం. పలు వాస్తవ కథనాలు, మౌఖిక చరిత్రలు, మరుగునపడిన రికార్డుల ఆధారంగా ఆ కాలాన్ని సినిమాటిక్‌గా పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మూడో చిత్రంగా ‘రణబాలి’ నిలవనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. టీ-సిరీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.