ఢిల్లీలో దారుణం: ఇంట్లో ఒంటరిగా ఉన్న 21 ఏళ్ల మోడల్ దారుణ హత్య

Muskan Delhi model brutally murdered at her home in Tilak Nagar
  • కత్తితో పొడిచి చంపిన దుండగుడు
  • జిమ్ ట్రైనర్ ఇమ్రాన్‌పై కుటుంబ సభ్యుల ఆరోపణలు
  • కొంతకాలంగా వేధిస్తున్నట్లు బంధువుల వెల్లడి
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
దేశ రాజధాని ఢిల్లీలో 21 ఏళ్ల యువతి, పార్ట్ టైమ్ మోడల్ అయిన ముస్కాన్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోనే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ పరిధిలో ఉన్న న్యూ మహావీర్ నగర్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ హత్య వెనుక ముస్కాన్ వెళ్లే జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్‌ అనే వ్యక్తి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్టూడెంట్‌గా ఉంటూనే మోడలింగ్ చేస్తున్న ముస్కాన్, తాను అద్దెకు ఉంటున్న ఇంటి రెండో అంతస్తులో బుధవారం ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ముస్కాన్ కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన కత్తి గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

గత ఒకటి, ఒకటిన్నర సంవత్సరాలుగా ముస్కాన్‌కు.. నిందితుడు ఇమ్రాన్‌కు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇమ్రాన్ గత కొంతకాలంగా ఆమెను వేధిస్తుండటంతో ముస్కాన్ అతడిని దూరం పెట్టినట్లు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అభిషేక్ గుప్తా తెలిపారు. ముస్కాన్ సోదరుడు కూడా ఇమ్రాన్‌పైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.  
Advertisement
Muskan
Delhi model murder
Imran gym trainer
Tilak Nagar crime
New Mahavir Nagar murder case
West Delhi crime news

More Telugu News