టెక్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 9న యాపిల్ కొత్త ఉత్పత్తులు!
- సెప్టెంబర్ 9న యాపిల్ ప్రత్యేక ఈవెంట్
- భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభం
- ఐఫోన్ 18 సిరీస్ ఆవిష్కరణపై భారీ అంచనాలు
- యాపిల్ వాచ్ సిరీస్ 12 వచ్చే అవకాశం
- తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌పై ఊహాగానాలు
యాపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్‌కు తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 9న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఈవెంట్ జరగనుంది. ఐఫోన్ 18 సిరీస్‌ను ఈ వేదికగా పరిచయం చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9న రాత్రి 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్, యాపిల్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం క్యూపర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ క్యాంపస్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రాను పరిచయం చేసే అవకాశం ఉంది. స్మార్ట్‌హోమ్ విభాగంలో కొత్త పరికరాలను కూడా తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ఏ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నారనే విషయాన్ని యాపిల్ అధికారికంగా వెల్లడించలేదు.
మరోవైపు యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ కూడా ఈసారి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9 ఈవెంట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
కెమెరాలతో కూడిన ఎయిర్‌పాడ్స్‌పై కూడా ఇటీవల చర్చ జరిగింది. ఈ ఉత్పత్తిని 2027లో తీసుకురావాలనే యాపిల్ ప్రణాళిక కొనసాగుతోందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. సరఫరా వ్యవస్థ, సాఫ్ట్‌వేర్ సమస్యలతో ఈ ఉత్పత్తి విడుదల వాయిదా పడినట్లు పేర్కొంది. ఇటీవల మాక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో ఈ ఎయిర్‌పాడ్స్‌కు సంబంధించిన వీడియో కనిపించడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.