టిబెట్ నుంచి దూసుకొచ్చిన వరద.. క్షణాల్లో నేపాల్‌లో విధ్వంసం (వీడియోలు)

Flood rushing from Tibet causes destruction in Nepal within seconds
  • నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు
  • ఈ ఘటనలో 19 మంది మృతి, 400 మందికి పైగా గల్లంతు
  • గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు
  • చైనాలోని టిబెట్ నుంచి పోటెత్తిన భోటే కోశీ నది
నేపాల్‌లో భారీ జల ప్రళయం సంభవించింది. చైనా సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, 105 మంది భారతీయులతో సహా సుమారు 400 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గల్లంతైన వారిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నట్లు అధికారులు ధ్రవీకరించారు. గల్లంతైన భారతీయుల్లో 59 మంది కైలాస మానస సరోవర యాత్రికులు కాగా, మరో 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

బుధవారం ఉదయం 9 గంటల సమయంలో టిబెట్‌లోని గైరాంగ్ పోర్ట్ నుంచి బురద, రాళ్లతో కూడిన భారీ వరద ప్రవాహం భోటే కోశీ నది ద్వారా నేపాల్‌లోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో రసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. క్షణాల్లో వ్యవధిలోనే పార్కింగ్ ప్రదేశాలు, వాహనాలు, భవనాలను వరద నీరు ముంచెత్తుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ఈ విపత్తు నేపథ్యంలో నేపాల్ సైన్యం రంగంలోకి దిగి హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలతో సహాయక చర్యలు చేపట్టింది. త్రిశూలి నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నేపాల్ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు.
Advertisement
Nepal Flash Floods
Tibet Flood Destruction
Missing Indian Pilgrims
Kailash Mansarovar Yatra
Rasuwa District Nepal

More Telugu News