'ఐఆర్‌సీటీసీ'తో 70 శాతం యూజర్లకు తిప్పలు.. సర్వేలో షాకింగ్ నిజాలు!
- టికెట్ బుక్ చేస్తుండగా అకస్మాత్తుగా లాగౌట్ అవుతున్నట్టు ఫిర్యాదులు
- ఇన్సూరెన్స్, విరాళాలు వంటివి తెలియకుండానే యాడ్ అవుతున్నాయని ఆరోపణ
- లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో బయటపడ్డ కీలక అంశాలు
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు ఒక జాతీయ సర్వేలో వెల్లడైంది. లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, దాదాపు 70 శాతం మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది.
టికెట్లు బుక్ చేసే సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తమ ఖాతాలు ఉన్నట్టుండి లాగౌట్ అవుతున్నాయని మెజారిటీ వినియోగదారులు ఫిర్యాదు చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మందికి ఈ సమస్య తరచుగా ఎదురవుతుండగా, 28 శాతం మంది అప్పుడప్పుడు ఇటువంటి అనుభవం ఎదురవుతోందని తెలిపారు. ఇలా అకస్మాత్తుగా లాగౌట్ అవ్వడం వల్ల అనుకున్న రైలులో బెర్తులు దొరక్కపోవడం లేదా నిర్దేశిత సీట్లను కోల్పోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే కాకుండా మరో ఐదు రకాల సమస్యలు కూడా యూజర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఈ సర్వే గుర్తించింది. వాటిలో ప్రధానంగా:
నాగింగ్ (46 శాతం): టికెట్ బుకింగ్ లేదా రద్దు సమయంలో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని లేదా వ్యక్తిగత సమాచారం అందించాలని పదేపదే ఒత్తిడి చేయడం.
బాస్కెట్ స్నీకింగ్ (45 శాతం): వినియోగదారుల ప్రమేయం లేకుండానే ఇన్సూరెన్స్, విరాళాలు వంటి అదనపు రుసుములను గుట్టుచప్పుడు కాకుండా బిల్లులో చేర్చడం.
డ్రిప్ ప్రైసింగ్ (43 శాతం): పన్నులు మినహా ఇతర ఛార్జీలను ముందుగా వెల్లడించకుండా, తుది చెల్లింపు సమయంలో మాత్రమే చూపించడం.
బైట్ అండ్ స్విచ్ (38 శాతం): తొలుత ఎంచుకున్న రైలు, సీటుకు బదులుగా బుకింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి మరొకటి కేటాయించడం.
ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్ (31 శాతం): బుకింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఇతర ప్రమోషన్లు లేదా ప్రకటనలు అడ్డురావడం.
దేశవ్యాప్తంగా 324 జిల్లాల్లోని 90,000 మందికి పైగా వినియోగదారుల నుంచి లోకల్‌సర్కిల్స్ ఈ వివరాలను సేకరించింది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఐఆర్‌సీటీసీ జులై మధ్యలో కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కొద్దికాలానికే ఈ సర్వే ఫలితాలు వెలువడటం గమనార్హం. ముఖ్యంగా రద్దీ సమయాల్లో టికెట్ బుకింగ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయని ఈ సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది.