స్థానిక ఎన్నికల్లో కూటమి శ్రేణులు సమన్వయంతో పని చేయాలి: పురందేశ్వరి

Purandeswari says alliance partners must coordinate in local body elections
  • కూటమి ఎన్నికల్లో కూటమి ఐక్యంగా బరిలోకి దిగుతుందన్న పురందేశ్వరి
  • 2024 ఫలితాలను స్థానిక ఎన్నికల్లో కూడా పునరావృతం చేయాలని పిలుపు
  • కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం పనులు వేగవంతమయ్యాయని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి (టీడీపీ-బీజేపీ-జనసేన) ఐక్యంగానే బరిలోకి దిగుతుందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి స్పష్టం చేశారు. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మన ఊరు – మన జెండా' కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం మాదిరిగానే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2024లో ప్రజలు అందించిన బలమైన మద్దతును స్థానిక సంస్థల్లోనూ పునరావృతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలోపేతమవుతోందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు. దేశ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకమని... స్థానిక సమరంలో కూటమి జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Advertisement
Daggubati Purandeswari
Andhra Pradesh local body elections
NDA alliance TDP BJP Janasena
Rajahmundry BJP meeting
Somu Veerraju
Amaravati and Polavaram projects

More Telugu News