పేపర్ లీక్ ఆరోపణలు.. మహారాష్ట్ర డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ రద్దు
- పేపర్ లీక్ ఆరోపణలతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ గ్రూప్-బి పరీక్ష రద్దు
- మొత్తం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేసిన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
- ప్రశ్నపత్రాన్ని రూ.40 లక్షలకు అమ్మారని ప్రతిపక్షాల ఆరోపణ
- విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. సమగ్ర దర్యాప్తునకు హామీ
- ఇది అభ్యర్థుల పోరాట విజయమన్న కాంగ్రెస్ నేత
మహారాష్ట్రలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం సృష్టించడంతో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీఎస్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ గ్రూప్-బి పోస్టుల భర్తీకి సంబంధించి చేపట్టిన నియామక ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చేపట్టిన ప్రాథమిక విచారణ అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకుంది.
ఈ పరీక్ష ప్రశ్నపత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్ల ద్వారా ఒక్కో అభ్యర్థికి రూ. 40 లక్షల చొప్పున విక్రయించారని ప్రతిపక్ష ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం కమిషన్ దృష్టికి వచ్చినప్పటికీ, కేవలం ఒక్క అభ్యర్థికి మాత్రమే ప్రశ్నాపత్రం చేరిందని పేర్కొనడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎంపీఎస్‌సీ ఛైర్మన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు, ఈ అంశంపై తాను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి చర్చించానని బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ వెల్లడించారు. పేపర్ లీకేజీని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. పరీక్షకు ముందే ఒక అభ్యర్థికి ప్రశ్నపత్రం అందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడంతో, ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని నియామక ప్రక్రియనే రద్దు చేస్తున్నట్లు ఎంపీఎస్‌సీ స్పష్టం చేసింది. కాగా, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత విజయ్ వడెట్టివార్ స్వాగతించారు. ఇది పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అభ్యర్థులకు లభించిన విజయమని ఆయన అభివర్ణించారు.