ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సభపై న్యూయార్క్‌లో వివాదం.. మేయర్‌పై అమెరికన్ సింగర్ ఫైర్
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సభపై న్యూయార్క్‌లో మొదలైన వివాదం
- సభను వ్యతిరేకిస్తున్న మేయర్‌పై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ విమర్శలు
- మోదీ, బీజేపీపై వ్యతిరేకతతోనే సభను అడ్డుకుంటున్నారన్న మిల్బెన్
- ఆగస్టు 29న మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో "యూనివర్సల్ వన్నెస్" పేరిట ఈవెంట్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమంపై అమెరికాలో వివాదం రాజుకుంది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరగనున్న ఈ వేడుకను న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యతిరేకించడంపై అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ఉన్న రాజకీయ వ్యతిరేకతతోనే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా స్పందించిన మేరీ మిల్బెన్, "మేయర్ మమ్దానీ వంటి సోషలిస్టులు భారత ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తున్నందునే ఈ సభను అడ్డుకుంటున్నారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఒక ప్రైవేట్ సంస్థ. అది సోషలిస్టుల అభీష్టానుసారం కాకుండా పెట్టుబడిదారీ విధానంలో నడుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం జరిగి తీరుతుంది" అని స్పష్టం చేశారు. "మీరు కూడా పెట్టుబడిదారులుగా ఎదిగి, నిధులు సమకూర్చుకుని, మాడిసన్ స్క్వేర్‌ను అద్దెకు తీసుకుని మీ మోదీ వ్యతిరేక ర్యాలీలు నిర్వహించుకోండి" అని ఆమె చురక అంటించారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, "యూనివర్సల్ వన్ నెస్ సెలబ్రేషన్" పేరుతో ఆగస్టు 29న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 5,000 మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని అంచనా వేస్తున్న ఈ వేడుక కోసం మోహన్ భగవత్ ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్నారు.
మరోవైపు, ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని మేయర్ మమ్దానీ స్పష్టం చేశారు. తాను చూసిన భారతదేశం అందరినీ కలుపుకుపోయే లౌకిక గణతంత్రమని, అయితే ప్రస్తుతం పెరుగుతున్న మినహాయింపువాదం ఆందోళన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పలు పౌర, మానవ హక్కుల సంఘాలు సైతం ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.