బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితికి వ్యతిరేకంగా స్థానికుల నిరసన
- ఉత్సవ కమిటీలో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని నిరసన
- బడుగు, బలహీన వర్గాల ప్రజలను దూరం పెడుతున్నారని ధర్నా
- కమిటీ సభ్యులను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆరోపణ
బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితిలో కేవలం అగ్రవర్ణాల వారికే ప్రాధాన్యం ఇస్తూ, బడుగు బలహీన వర్గాల ప్రజలను దూరంగా పెడుతున్నారంటూ బుధవారం బాలాపూర్ గణేశ్ మండపం వద్ద కొందరు స్థానికులు నిరసన ధర్నా చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ఉత్సవ సమితిపై ఉందని ఈ సందర్భంగా బొర్ర రవి పేర్కొన్నారు.
ఉత్సవ సమితి ఇదే రకమైన మొండి వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి, తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ నిరసన ధర్నాకు స్థానికుడైన పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.