గోల్కొండ కోట సమీపంలో బయటపడ్డ పురాతన సొరంగం
- కుతుబ్ షాహీ కాలం నాటిదిగా భావిస్తున్న అధికారులు
- అగ్నివీరుల శిక్షణ కోసం భూమి చదును చేస్తుండగా గుర్తింపు
- సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పురావస్తు శాఖ
- సొరంగం చూసేందుకు భారీగా తరలివచ్చిన స్థానికులు
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోట సమీపంలో ఒక పురాతన సొరంగం బయటపడింది. ఇది కుతుబ్ షాహీ కాలం నాటిదిగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నివీరుల శిక్షణ నిమిత్తం భూమిని చదును చేస్తుండగా ఈ సొరంగ మార్గం అనుకోకుండా వెలుగులోకి వచ్చింది.
గోల్కొండ కోట పరిసర ప్రాంతమైన అత్తాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నివీరుల శిక్షణ కోసం గోల్కొండ ఆర్టిలరీ అధికారులు ఎక్స్‌కవేటర్‌తో భూమిని ఎత్తుపల్లాలు లేకుండా మారుస్తుండగా, భూగర్భంలోని ఈ నిర్మాణం బయటపడింది. వెంటనే స్పందించిన అధికారులు పనులను నిలిపివేసి, కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు.
భారీ రాతి పలకలతో కప్పి ఉన్న ఈ సొరంగంలోకి వెళ్లేందుకు వీలుగా మార్గం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా జనసంచారం తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో సొరంగం బయటపడిందన్న వార్త తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఈ సొరంగం పొడవు ఎంత? లోపల ఏవైనా చారిత్రక కళాఖండాలు ఉన్నాయా? అనే అంశాలపై స్థానికులు, చరిత్రకారుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పురావస్తు శాఖ చేపట్టబోయే తవ్వకాలతో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.