చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్
- తనపై చిన్నారెడ్డి అవినీతి ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టిన వనపర్తి ఎమ్మెల్యే
- అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని వెల్లడి
- చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సాయం చేస్తున్నారని ఆరోపణ
వనపర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. చిన్నారెడ్డిపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకునే వరకు తన పోరాటం ఆగదని హెచ్చరించారు.
వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో నిర్వహించిన పార్టీ కార్యక్రమం ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువైంది. ఆ సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. తన సహనం నశిస్తే మరో ‘జీవన్‌రెడ్డి’ తరహా తిరుగుబాటు చేస్తానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మేఘారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి చిన్నారెడ్డి తననే లక్ష్యంగా చేసుకుని నిరంతరం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఎదురుదాడికి దిగుతూ పలు ప్రశ్నలు సంధించారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చిన్నారెడ్డికి టికెట్ ఎలా లభించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడుసార్లు పోటీ చేసేందుకు ఆయన ఎవరికి డబ్బులు ముట్టజెప్పారో బహిర్గతం చేయాలని కోరారు. అలాగే, బీఆర్ఎస్ నాయకులకు పనులు చేసి పెట్టాలని చిన్నారెడ్డి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, వారికి ఫోన్లు చేస్తున్నారని మేఘారెడ్డి ఆరోపించారు.
ఈ వ్యవహారమంతటిపై ఏఐసీసీ, పీసీసీ, పార్టీ క్రమశిక్షణ సంఘంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు మేఘారెడ్డి వెల్లడించారు.