డీప్‌ఫేక్‌లపై కేంద్రం ఉక్కుపాదం.. 3 గంటల్లో తొలగించాల్సిందే
- డీప్‌ఫేక్‌లపై కేంద్రం కఠిన నిబంధనలు
- సున్నితమైన ఫిర్యాదుల పరిష్కారానికి 2 గంటలే
- ఏఐ కంటెంట్‌కు గుర్తింపు వివరాలు తప్పనిసరి
- ఆటోమేటెడ్ వ్యవస్థలతో పర్యవేక్షణ
- డీప్‌ఫేక్ గుర్తింపునకు ఐఐటీల సాంకేతికత
- ఫిర్యాదుల కోసం అప్పీల్ వ్యవస్థ, ‘సహయోగ్’ పోర్టల్
సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఫొటోలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అక్రమ కంటెంట్‌పై ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే తొలగించాలని మధ్యవర్తి వేదికలకు (ఇంటర్మీడియరీలు) ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ గడువు 36 గంటలు ఉండేది.
లోక్‌సభలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ వివరాలు వెల్లడించారు. డీప్‌ఫేక్‌లు, ఏఐతో రూపొందించిన తప్పుడు సమాచారం పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ నిబంధనలను బలోపేతం చేసినట్లు చెప్పారు.
నగ్న చిత్రాలు, వ్యక్తుల వేషధారణను అనుకరించడం, అశ్లీల కంటెంట్ వంటి సున్నితమైన అంశాలపై వచ్చే ఫిర్యాదులను ఇకపై రెండు గంటల్లోనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. గతంలో ఇందుకు 24 గంటల గడువు ఉండేది.
ఏఐతో రూపొందించిన కంటెంట్‌కు స్పష్టమైన గుర్తింపు, సోర్స్ వివరాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది. దీంతో వినియోగదారులు అది నిజమైనదా, కృత్రిమంగా రూపొందించిందా అనేది సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
చట్టాలను ఉల్లంఘించే డీప్‌ఫేక్ కంటెంట్ తయారీ, ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఆటోమేటెడ్ సాంకేతిక వ్యవస్థలను వినియోగించాలని కూడా సూచించింది. బాలల లైంగిక దోపిడీ, అనుమతి లేకుండా వ్యక్తిగత చిత్రాల ప్రచారం, వేషధారణ మోసాల వంటి కంటెంట్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
డీప్‌ఫేక్‌లను గుర్తించేందుకు ఐఐటీ జోధ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసిన ప్రత్యేక వ్యవస్థలను కూడా కేంద్రం ప్రస్తావించింది. అలాగే ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్ అధికారుల నియామకం, కేంద్ర స్థాయిలో అప్పీల్ వ్యవస్థ, ‘సహయోగ్’ పోర్టల్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.