ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం 11వ రోజూ విజయవంతం
- 11 రోజుల్లో 30.38 లక్షల ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు
- నేడు అత్యధిక ఇళ్లను 3.40 లక్షల ఇళ్లను సందర్శించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
- కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా విజయాలను ప్రతి ఇంటికీ వివరిస్తున్న పార్టీ శ్రేణులు
- టెక్నాలజీ ద్వారా కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నారా లోకేష్
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం - 2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమం విజయవంతంగా 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 11వ రోజున రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల గృహాలను టీడీపీ శ్రేణులు సందర్శించాయి. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్లను సందర్శించడం ఇదే ప్రధమం. దీంతో గత 11 రోజుల్లో మొత్తంగా 30.38 లక్షల గృహాలకు చేరుకుని, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీల అమలు తీరును ప్రతి ఇంటికీ చేరవేశారు.
'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిరంతరం సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సందర్శనలు, పార్టీ శ్రేణుల పనితీరుపై ఆయన ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను నారా లోకేశ్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు లోకేశ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.