Advertisement

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్: దరఖాస్తుల తేదీలు ఖరారు

Telangana Police Recruitment Application Dates Confirmed
  • తెలంగాణలో 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రకటన
  • ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
  • పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో ఖాళీల భర్తీ
  • నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలీస్ శాఖతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలలో అత్యధికంగా కానిస్టేబుల్, ఆ పైస్థాయి ఉద్యోగాలే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పోస్టుల వివరాలను పరిశీలిస్తే సివిల్ ఎస్సై-148, ఏఆర్ ఎస్సై-14, టీజీఎస్పీ ఏఆర్ ఎస్సై-12, ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సై-03, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై-23, సివిల్ కానిస్టేబుల్-3,697, ఏఆర్ కానిస్టేబుల్-1,052, ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్-24, కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీవో-20, కానిస్టేబుల్ (మెకానిక్) పీటీవో-07 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
Advertisement
TSLPRB
Telangana Police Recruitment
TS Police Constable Jobs
Telangana SI Notification

More Telugu News