Advertisement

ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Rega Kantha Rao approaches High Court to quash FIR
  • లైంగిక వేధింపుల ఆరోపణలతో రేగా కాంతారావుపై కేసు
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను వేధించారంటూ యువతి ఫిర్యాదు
  • తన ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగుతున్న కుట్ర అన్న రేగా

తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ నేత, పినపాక మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు న్యాయపోరాటానికి దిగారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు (క్వాష్) చేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.


యూట్యూబ్ ఇంటర్వ్యూ సాకుతో ఫ్లాట్‌కు పిలిపించి, ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను వేధించారంటూ ఈ నెల 26న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా... ఈ వ్యవహారంపై రేగా కాంతారావు ఘాటుగా స్పందించారు.


తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితాలని, కేవలం రాజకీయ ప్రతీకారంతోనే తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ కుట్ర పన్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో బనాయించిన ఈ కేసు నుంచి తనకు ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. నేటి విచారణలో న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకోబోతోందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

Advertisement
Rega Kantha Rao
Telangana High Court
FIR Quash Petition
Pinapaka MLA Case
Panjagutta Police Station
BRS Leader Sexual Harassment Case

More Telugu News